Dil Raju: సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు

Sankranthi Releases 2024: సంక్రాంతి సినిమాల విషయంలో టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుంటూరు కారం మూవీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హనుమాన్ మూవీని తొక్కేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు అని నెట్టింట చర్చ జరుగుతుంది. మరో పక్క తాను ఆ ఉద్దేశంతో అనలేదని తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని దిల్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 06:00 AM IST
Dil Raju: సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు

Guntur Kaaram: సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే సినీ లవర్స్ కు పండుగ వాతావరణం వచ్చినట్టే. అయితే మరోపక్క డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి  దారుణంగా ఉంటుంది. ఏ సినిమాను కాదనలేక ప్రతి సినిమాని అకామిడేట్ చేయలేక వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. పైగా ఈసారి పండుగకి థియేటర్ల కోసం పోటీ చాలా గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న టెన్షన్స్ చాలవు అన్నట్లు..అప్పుడెప్పుడో  ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఒక విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంతమంది నేటిజన్స్.

ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో సంక్రాంతికి విడుదల కాబోయే డబ్బింగ్ సినిమాల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు.. వాటి గురించి మనకెందుకు అని దిల్ రాజు సమాధానం ఇచ్చారు. మరి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న తమిళ్ డబ్బింగ్ మూవీ అయలాన్ ఉత్తరాంధ్ర, నైజామ్ రైట్స్ సొంతం చేసుకోవడం.. మిగిలిన ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అప్పుడు దిల్ రాజ్ మాట్లాడిన మాటలు మరొకసారి డిస్కషన్ కి వచ్చాయి. అంతేకాదు గత సంవత్సరం కూడా తమిళ డబ్బింగ్ వారసుడు సినిమాని ప్రొడ్యూస్ చేయడం వల్ల దిల్ రాజు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

మరోపక్క ఈగల్ మూవీ  వాయిదా పడిన విషయాన్ని ప్రకటించినప్పుడు.. దిల్ రాజ్ హనుమాన్ మూవీ ప్రాధాన్యత క్రమంలో లాస్ట్ లో ఉంటుంది అన్నట్లుగా మాట్లాడిన మాటలకు నిన్న హనుమాన్ ఈవెంట్ లో చిరు కౌంటర్ ఇచ్చారు. గతంలో  చిరు ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలైన టైంలో.. శతమానంభవతిని ఎందుకు రిలీజ్ చేశారు అని చిరు ప్రశ్నించారు. అయితే దీనికి అప్పట్లో దిల్ రాజు కంటెంట్ బాగుంది కాబట్టి మూవీకి ఢోకా లేదు అని సమాధానం ఇచ్చారట.. ఇప్పుడు చిరు ఆ విషయాన్ని ప్రస్తావించి.. మరి ఇప్పుడు కూడా అదే పాటించవచ్చుగా అన్నట్లు చిరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హనుమాన్ మూవీ కంటెంట్ మంచిగా ఉంది అని తెలిసినప్పుడు వాయిదా వేసుకోమని పోటీ నుంచి తప్పుకోమని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు కదా అనేది చిరు ఇచ్చిన కౌంటర్ అలానే ప్రేక్షకుల మదిలో ఉన్న ఆలోచన కూడా.

మరోపక్క లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వారసుడు సినిమా వచ్చేటప్పుడు ఇలాంటి సమస్య ఎదురయ్యింది. అయితే అప్పుడు దిల్ రాజ్ ఇది వ్యాపారం ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చు అని గట్టిగా చెప్పాడు. మరి ఇప్పుడు గుంటూరు కారం విషయానికి వచ్చేసరికి ఎందుకని హనుమాన్ మూవీకి తక్కువ సింగిల్ స్క్రీన్స్ వచ్చేలా చేశాడు అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే నెట్టింట తన గురించి జరుగుతున్న చర్చపై దిల్ రాజ్ కాస్త ఘాటుగానే స్పందించాడు. అనవసరంగా తనపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని.. హనుమాన్ మూవీ రిలీజ్ చేయొద్దు అని తాను అనలేదని.. ప్రస్తుతం థియేటర్లో విషయంలో ఎదురవుతున్న ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకొని డేట్ వాయిదా వేసుకుంటే బాగుంటుంది అని సజెస్ట్ చేసినట్లు దిల్ రాజు పేర్కొంటున్నారు. అంతేకాదు తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు అని గట్టిగా చెప్పారు. అలా చేసేవారి తాట తీస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఫైనల్ గా దిల్ రాజు పై జరుగుతున్న సోషల్ మీడియా డిస్కషన్ ఇప్పుడు ఈ నిర్మాత వార్నింగ్ తో అయినా ఆగుతుందేమో చూడాలి. 

Also read: Sankranthi Holidays 2024: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే

Also read: Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్, పుట్టినతేదీ మార్చేందుకు ఏమేం అవసరం, ఎలా చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News