Dil Raju: విజయ్ దేవరకొండ సినిమా తో దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. మహేష్ బాబు సినిమాకి లైన్ క్లియర్..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి బరిలో దిగనుంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాని అడ్డంగా పెట్టుకుని మహేష్ బాబు సినిమాకి తక్కువ కాంపిటేషన్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అసలు సంగతి తెలియాలి అంటే ఇది ఒకసారి చదివేయండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 05:03 PM IST
Dil Raju: విజయ్ దేవరకొండ సినిమా తో దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. మహేష్ బాబు సినిమాకి లైన్ క్లియర్..

Guntur Karam : టాలీవుడ్ లో నిర్మాతగా మాత్రమే కాక డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ముఖ్యంగా సినిమా విడుదల తేదీ విషయంలో దిల్ రాజు వేసే స్ట్రాటజీలు కచ్చితంగా వర్కౌట్ అయ్యేలా ఉంటాయి. తాజాగా ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం విషయంలో కూడా దిల్ రాజు అలాంటి ఒక పెద్ద స్ట్రాటజీ తోనే ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి ఏడాది సంక్రాంతి అంటేనే పండగ సినిమాల సీజన్. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ సంక్రాంతి బరిలో దిగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక వచ్చే ఏడాది కూడా సంక్రాంతి బరిలో కొని ఆసక్తికరమైన సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మొదటిది సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గుంటూరు కారం సినిమా.

దిల్ రాజు ఈ సినిమా రైట్స్ ని 45 కోట్ల వరకు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రైట్స్ కూడా దిల్ రాజు దగ్గరే ఉన్నాయి. ఈ సినిమా కూడా సంక్రాంతి సమయంలోనే విడుదల అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు సినిమాలకు తానే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి రెండు సినిమాల విడుదల తేదీలకీ కనీసం మూడు రోజుల సమయం ఉండేలాగా చూసుకుంటానని దిల్ రాజు మహేష్ బాబు కి మాటిచ్చారట. కానీ జనవరి 15 తో పండుగ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా సంక్రాంతి అనగానే మరికొన్ని సినిమాలు లైన్ లో చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

దిల్ రాజువే రెండు సినిమాలు ఉండడంతో చాలావరకూ థియేటర్లు దిల్ రాజు చేతుల్లోనే ఉంటాయి అని, తమ సినిమాకి సరైన థియేటర్లు దొరుకుతాయో లేదో అన్న భయంతో అయినా ఒకటి రెండు సినిమాలు డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరి దాకా ఈ భయం ఉంటే ఒకటి రెండు సినిమాలు డ్రాప్ అయిపోతాయి. ఆ తర్వాత ఫ్యామిలీ సార్ సినిమాని కూడా మార్చ్ కి వాయిదా వేస్తే గుంటూరు కారం సినిమా ఒక్కటే పెద్ద కాంపిటీషన్ లేకుండా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే దిల్ రాజు మాస్టర్ ప్లాన్.

వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలు చేయడం లేదు. కాబట్టి గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు కచ్చితంగా సంక్రాంతి బరిలోనే దిగనున్నాయి. ఇక హను మ్యాన్, ఈగల్ సినిమాలలో ఒకటి వచ్చినా గుంటూరు కారం సినిమా మీద అంత ప్రభావం ఉండదనే చెప్పుకోవాలి.

Also Read: Mega Brothers Photo: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. కూల్‌ లుక్‌లో మెగా బ్రదర్స్‌..!  

Also Read: Blaupunkt Soundbar: చీప్‌ ధరకే బెస్ట్‌ 100W సౌండ్‌ బార్‌..దీపావళి ప్రత్యేక సేల్‌పై అదనంగా 29 శాతం తగ్గింపు! 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News