Deepthi Sunaina : డైలీ చేసుకుంటావా? లేదా?.. నెటిజన్ ప్రశ్న.. దీప్తి సునయన సమాధానమిదే

Bigg Boss Deepthi Sunaina బిగ్ బాస్ ఇంట్లో దీప్తి సునయన చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీప్తి సునయన ఇప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులను అలరించేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 03:12 PM IST
  • నెట్టింట్లో దీప్తి సునయన సందడి
  • బిగ్ బాస్ బ్యూటీగా నెట్టింట్లో హల్చల్
  • అభిమానులతో దీప్తి సునయన ముచ్చట్లు
Deepthi Sunaina : డైలీ చేసుకుంటావా? లేదా?.. నెటిజన్ ప్రశ్న.. దీప్తి సునయన సమాధానమిదే

Bigg Boss Deepthi Sunaina బిగ్ బాస్ ఇంట్లో దీప్తి సునయన నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు దీప్తి సునయన మీద మరీ అంత నెగెటివ్ ఇమేజ్ లేదు. షన్నుతో బ్రేకప్ జరగడం, ఇప్పటికీ సింగిల్‌గా ఉండటం, తన బతుకుతేదో తాను అన్నట్టుగా బతికేస్తోండటం.. తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలంటూ తిరగడం వంటివి చేస్తోంది. ఇక ఇప్పుడు దీప్తి సునయన అయితే ప్రత్యేకంగా సపరేట్‌గా ఓ ఇంట్లో బతికేస్తోంది.

దీప్తి సునయన ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా బిజీగా ఉంటోంది. దీప్తి సునయన తనకంటూ సపరేట్‌గా ఓ ఇంటిని కొనేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీప్తి సునయన తన అమ్మానాన్నలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. ఏమైనా కూడా దీప్తి సునయన మాత్రం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి సందడి చేస్తుంటుంది.

ఇక దీప్తి సునయన ఎప్పుడూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఆమె తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుంటుంది. అయితే దీప్తి సునయన తన అభిమానులకు ఇచ్చే రిప్లైలు ఎంతో ఫన్నీగా ఉంటాయి. ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా దీప్తి సునయన నవ్వుతూనే సమాధానం ఇస్తుంటుంది. ఆమెను ఎక్కువగా హెల్త్ కేర్, బ్యూటీ కేర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటారు.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

ఇక దీప్తి సునయన ఇప్పుడు ఒంటరిగా ఉంటోంది కాబట్టి.. ఆమెను వంటకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. నువ్వే రోజు వంట చేసుకుంటావా? లేదా? జొమాటో, స్విగ్గీలు అంటూ ఆర్డర్లు పెట్టుకుంటావా? అని అడిగారు. తానే రోజు వండుకుంటాను అని, జొమాటోల్లో ఆర్డర్లు పెట్టను అని, తాను చేసిన ఫుడ్డును తన ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారని చెప్పుకొచ్చింది.

దీప్తి సునయన షన్ను మళ్లీ కలుస్తారని వారిద్దరి అభిమానులు అనుకుంటున్నారు. కానీ దీప్తి సునయన మాత్రం ఇంకా  షన్ను మీద కోపంతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు షన్నుతో మళ్లీ కలిసి ప్రయాణించే ఉద్దేశమే దీప్తికి లేనట్టుగా తెలుస్తోంది.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News