Deepika Padukone : దీపిక పదుకొణెకు అరుదైన గౌరవం.. ఆస్కార్ వేదికపై బాలీవుడ్ బ్యూటీ సందడి

Deepika Padukone To Attend 95th Oscar దీపిక పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. మొన్న రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ప్రజెంటర్‌గా కనిపించాడు. ఇప్పుడు దీపిక పదుకొణె ఏకంగా ఆస్కార్ ఈవెంట్లోనే ప్రజెంటర్‌గా కనిపించబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 12:38 PM IST
  • వచ్చే వారమే ఆస్కార్ వేడుకలు
  • ఆస్కార్ నుంచి దీపిక పదుకొణెకు ఆహ్వానం
  • ప్రజెంటర్‌గా కనిపించబోతోన్న బాలీవుడ్ బ్యూటీ
Deepika Padukone : దీపిక పదుకొణెకు అరుదైన గౌరవం.. ఆస్కార్ వేదికపై బాలీవుడ్ బ్యూటీ సందడి

Deepika Padukone To Attend 95th Oscar మార్చి 12న జరిగే 95వ ఆస్కార్ వేడుకల్లో దీపిక పదుకొణె ప్రత్యేకంగా మెరవనుంది. తాజాగా ఆమెకు ఆస్కార్ నుంచి ఆహ్వానం అందించింది. ఆస్కార్ వేడులకను అందించే సెలెబ్రిటీల లిస్ట్‌లో ఆమె పేరును చేర్చారు. ఆస్కార్ వేడుకల్లో ప్రజెంటర్‌గా దీపిక పదుకొణెకు ఆహ్వానం అందడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆమె హాట్ టాపిక్ అయింది. ఈ వార్తను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి సంబరపడుతోంది.

అసలే ఈ సారి ఆస్కార్ అవార్డులపై దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. మరి అదే నిజం అవుతుందా? లేదా? అన్నది ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

ఇక దీపికతో పాటుగా ఈ ఈవెంట్‌లో రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, జెన్నిఫర్ కొన్నెల్లీ, అరియానా డీ బోస్, శామ్యూల్ ఎల్ జాక్సన్, డ్వానే జాన్సన్, మైఖెల్ బి జోర్డాన్, ట్రాయ్ కోట్సుర్, జొనాటన్ మేజర్స్, మెలిస్సా మెక్ కార్తీ, జనెల్లే మోనాయ్, క్వెస్ట్లోవ్, జాయ్ సాల్దానా, డొన్ని యెన్ వంటి వారు కూడా సందడి చేయబోతోన్నారు.

 

దీపిక పదుకొణె ఈ ఏడాది ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది. పఠాన్ సినిమా విషయంలో దీపికను అందరూ టార్గెట్ చేశారు. పఠాన్ సినిమా రిలీజ్ కంటే ముందు భేషరమ్ సాంగ్, అందులో కాషాయపు రంగు బికినీని ధరించి డ్యాన్సులు వేయడంతో దీపికను ఎక్కువగా ట్రోల్ చేశారు. అయితే పఠాన్ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News