Venkatesh Remuneration: 'ఎఫ్ 3'కి మూడురెట్ల పారితోషికం.. వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Venkatesh Remuneration for F3 Movie. ఎఫ్‌ 3 సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేశ్‌ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 04:07 PM IST
  • మే 27న 'ఎఫ్‌ 3' విడుద‌ల
  • ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం
  • వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Venkatesh Remuneration: 'ఎఫ్ 3'కి మూడురెట్ల పారితోషికం.. వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Daggubati Venkatesh takes Rs 15 crore Remuneration for F3 Movie: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'ఎఫ్‌ 3'. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఎఫ్‌ 3లో తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలు. 2019లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఎఫ్‌ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌ 3 తెర‌కెక్కిన విషయం తెలిసిందే. ఎఫ్ 2కి మించిన వినోదం ఎఫ్ 3లో ఉంటుందని డైరెక్టర్, హీరోలు ముందునుంచి చెపుతున్నారు. ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఎఫ్‌ 3 సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేశ్‌ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఎఫ్‌ 2 కోసం రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్న వెంకీ.. ఎఫ్‌ 3కి ఏకంగా రూ.15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే వెంకటేశ్‌ తన పారితోషికంను మూడు రెట్లు పెంచాడు అన్నమాట. ఎఫ్‌ 2 భారీ హిట్ కొట్టడంతో నిర్మాతలు కూడా ఇంతమొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నారట. మరోవైపు వరుణ్ తేజ్, తమన్నా భాటియాలకు కూడా భారీ రెమ్యూనరేషన్ అందినట్టు సమాచారం. 

మే 27న రిలీజ్ కానున్న ఎఫ్‌ 3 సినిమా టికెట్స్ రేట్స్ పెంచడం లేదని నిర్మాత దిల్‌ రాజు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతోనే కుటుంబంతో కలిసి హ్యాపీగా సినిమా చూడండని దిల్‌ రాజు చెప్పారు. 'కరోనా సమయంలో సినిమా షూటింగ్‌ వాయిదా పడటం వల్ల బడ్జెట్‌ పెరిగింది. అందరూ ఇంట్లోనే సినిమాల చూడటంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. టికెట్‌ రెట్స్‌ పెంచడం వల్ల పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందొచ్చు. అయితే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చేందుకు ధైర్యం చెయ్యట్లేదు. 2-3 సార్లు సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఒక్కసారి మాత్రమే థియేటర్‌కు వచ్చారు' అని రాజు పేర్కొన్నారు. 

ఎఫ్‌ 3 సినిమాలో వెంకటేష్, వ‌రుణ్‌ల‌కు జోడీగా త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సునీల్, ప్రగతి, రఘుబాబు, సోనాల్‌ చౌహ‌న్‌లు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. ఇక స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ప్రేక్షకులకు అందాల విందు చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.  

Also Read: Virat Kohli Record: విరాట్ కోహ్లీ రేర్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!

Also Read: Gyanvapi Masjid Surve: జ్ఞాన్‌వాపి మసీదులో త్రిశూలం, ఢమరుకం! వీడియోగ్రఫీ సర్వే నివేదికలో సంచలనాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News