Mirayi: తేజ సజ్జ సినిమాలో దుల్కర్ సల్మాన్ లేనట్టేనా.. అదే కారణం!

Mirayi : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి జాంబీ రెడ్డి, హనుమాన్ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో తేజ సజ్జ. తాజాగా ఇప్పుడు మిరాయి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కానీ ఈ వార్తలలో నిజం ఉందా?

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2024, 07:24 PM IST
Mirayi: తేజ సజ్జ సినిమాలో దుల్కర్ సల్మాన్ లేనట్టేనా.. అదే కారణం!

Mirayi : ఈ మధ్యనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జ హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు తేజ ఇప్పుడు తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి మిరాయి అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ కూడా సినిమాలో ఒక ముఖ్యపాత్ర లో నటించనున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు చిత్ర బృందం ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదు అంటూ కొట్టి పాడేసింది.

అయితే సినిమాలోని ఆ పాత్ర కోసం దర్శక నిర్మాతలు ముందు దుల్కర్ సల్మాన్ ని అనుకున్నారట. కానీ ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారని తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు ఆ పాత్ర కోసం మరొక నటుడుని వెతుకుతున్నట్లు సమాచారం. నిజానికి ఈగల్ సినిమా విడుదల కి ముందే మిరాయి సినిమా షూటింగ్ 30% పూర్తయిపోయింది. ప్రస్తుతం తేజ వెకేషన్ లో ఉన్నాడు. తేజ తిరిగి హైదరాబాదు రాగానే సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కాబోతోంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

కాగా ఈగల్ సినిమాతో కార్తీక్ ఘట్టమనేని ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయారు. కానీ హనుమాన్ తర్వాత తేజ సజ్జ సినిమా కాబట్టి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.‌ మరి అభిమానులకి సినిమాపై ఉన్న నమ్మకాన్ని కార్తీక్ ఘట్టమనేని ఎంతవరకు నిలబెడతారు అని వేచి చూడాలి.

Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News