Chiranjeevi: ఇక నో రాజకీయాలు.. ఓన్లీ సినిమాలు.. చిరంజీవి సెన్సేషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi Movies: సినిమాల్లో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జీరోగానే మిగిలారు. ఇక ఈ విషయం చిరంజీవికి కూడా అర్థమైందో ఏమో కానీ తన షాకింగ్ నిర్ణయాన్ని ఫైనల్ గా బయటపెట్టారు ఈ హీరో…

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 13, 2024, 05:24 PM IST
Chiranjeevi: ఇక నో రాజకీయాలు.. ఓన్లీ సినిమాలు.. చిరంజీవి సెన్సేషనల్ వ్యాఖ్యలు

Megastar Chiranjeevi: టాలీవుడ్ లో మెగాస్టార్ ఎవరు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి వివిధ పాత్రల్లో కనిపించి మెప్పించి మెగాస్టార్ గా ఎదిగారు. ఎంతోమంది కొత్త హీరోలకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అయితే సినిమాల్లో ఇంతకీ పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం పేరు తెచ్చుకోలేకపోయారు. ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి తాను సినిమాలు ఇంకా చేయనన్న చిరంజీవి.. కొద్ది నెలలకి రాజకీయాలకు తను పనికిరాని అర్థం చేసుకొని పార్టీని కూడా కాంగ్రెస్ లోకి కలిపేశారు.

అప్పట్లో చిరంజీవి పైన ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. రాజకేయ నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు రాజకీయాలపై కామెంట్స్ చేస్తూ ఉంటే ఈ హీరో ఇప్పుడు ఫైనల్ గా తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పిన నిర్ణయం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఇటీవల ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరగగా ఈ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవితో కాన్ఫరెన్స్ జరగగా.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల గురించి కూడా చెప్పుకొచ్చారు.

చిరంజీవి మాట్లాడుతూ.. ‘బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నుంచి సేవలు అభిమానుల సహకారంతో ముందుకెళుతున్న టైం లో అప్పుడు ఇంకొంచెం సేవ చేయాలి అనిపించి రాజకీయాల్లోకి వెళ్ళాను. మనకు ఇంత ఇచ్చిన ప్రజలకు నేను కూడా ఏదో ఒక సేవ చెయ్యాలి అంటే రాజకీయాలు కరెక్ట్ అనుకున్నాను. కాని సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని నాకు తర్వాత అర్థమైంది. నేను గబుక్కున పాలిటిక్స్ లో కాలు వేసి పెద్ద తప్పు చేశాను అని అర్థమై మళ్ళీ ఇటు సినిమాల వైపు వచ్చేసాను. పాలిటిక్స్ లో ఇంకొంచెం పెద్ద ఎత్తున సేవలు చేద్దామని వెళ్ళాను కానీ నేటి పాలిటిక్స్ లో నాలాంటి వాడు అనర్హుడు అనేది నిజం. నేను అందులోకి వెళ్లి సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అభిమానుల నుంచి అదే ఆదరణ, ప్రేమ ఉంటుందా అని అనుమానంగా ఉండేది. కాని తిరిగి వచ్చాక అదే ప్రేమ, అదే అభిమానం మీ గుండెల్లో చోటు అలాగే చూపించారు. అందుకే నేను బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటాను, ఓపిక ఉన్నంత కాలం మీకోసం సినిమాలు చేస్తూనే ఉంటాను,’అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాదా ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న విశ్వంభర చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News