Acharya song controversy: వివాదంలో ఆచార్య ఐటం సాంగ్​.. ఆ లిరిక్స్​పై అభ్యంతరాలు!

మెగాస్టార్ చిరంజివి, ఆయన తనయుడు రామ్​ చరణ్​లు ప్రధాన పాత్రలుగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాలోని ఐటం సాంగ్​పై ఏపీలో హోం మంత్రికి ఫిర్యాదు చేశారు (Acharya item song in controversy) ఆర్​ఎంపీ డాక్టర్లు. తమను అవమానించేలా ఆ పాటలో లిరిక్స్​ ఉన్నాయని తమ ఫిర్యాదులో (Complaint on Acharya Item Song) పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 04:05 PM IST
  • విడుదలకు ముందే వివాదంలో అచార్య సినిమా
  • ఐటం సాంగ్​లో లిరిక్స్​పై ఏపీలు ఆర్​ఎంపీల అభ్యంతరం
  • హోం మంత్రికి వినతిని అందించిన వైద్యుల సంక్షేమ సంఘం
Acharya song controversy: వివాదంలో ఆచార్య ఐటం సాంగ్​.. ఆ లిరిక్స్​పై అభ్యంతరాలు!

Acharya song controversy: మెగాస్టార్ చిరంజివి, ఆయన తనయుడు రామ్​ చరణ్​లు ప్రధాన పాత్రలుగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాలోని ఐటం సాంగ్​పై ఏపీలో హోం మంత్రికి ఫిర్యాదు చేశారు (Acharya item song in controversy) ఆర్​ఎంపీ డాక్టర్లు. తమను అవమానించేలా ఆ పాటలో లిరిక్స్​ ఉన్నాయని తమ ఫిర్యాదులో (Complaint on Acharya Item Song) పేర్కొన్నారు.

వివాదం గురించి పూర్తి వివరాలు ఇలా..

ఆచార్య సినిమాలో హీరోయిన్ రెజీనా చేసిన స్పెషల్ సాంగ్​ 'సానా కష్టం' ఇటీవలే (Saana Kastam song for Acharya) యూట్యూబ్​లో విడుదలైంది.

భాస్కర బట్ల రాసిన ఈ పాట లిరిక్స్​లో ఓ చోట.. 'ఎక్కడెక్కడో నిమరొచ్చని కుర్రాలు ఆర్​ఎంపీలు అవుత్నారు' అని ఉంది. పాటలో ఈ లిరిక్స్​ వ్యంగ్యంగా తమను కించ పరిచేలా ఉన్నాయంటూ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు సహా పలువురు సభ్యులు (AP RMP doctors on Acharya item Song ) ఏపీ హోం మంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందజేశారు.

తమను అవమనానించినట్లు ఉన్న ఆ లిరిక్స్​ను పాట నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఆచార్య సినిమా గురించి..

ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం (About Acharya movie) వహించారు. చిరంజీవి, రామ్​ చరణ్​, పూజా హెగ్డె, కాజల్​ అగర్వాల్​ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. రామ్​ చరణ్​ సొంత బ్యానర్​ కొణిదెల ప్రొడక్షన్​ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిరంజన్​ రెడ్డి, అవినాశ్​ రెడ్డిలు నిర్మాతలు.

గత ఏడాదే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 4గా ఫిక్స్​ చేసింది చిత్ర యూనిట్​. కరోనా థార్డ్​ వేవ్ భయాల నేపథ్యంలో పలు సినిమాలు వాయిదా పడిన నేపథ్యంలో అనుకున్న తేదీకి ఆచార్య రిలీజ్ అవుతుందా లేదా అనేది (Acharya movie release date) సందేహంగా మారింది.

Also read: RGV vs AP Govt: ఆర్జీవీ సర్.. ప్రేక్షకుడికి నొప్పి లేదని నీకు ఎవరు చెప్పారు?! నేను 1000 పెట్టి టికెట్ కొనలేను!!

Also read: Director Sukumar: దర్శకుడు సుకుమార్‌పై మణిరత్నంకు ఎందుకు కోపం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News