Chinmayi Sripada interesting Comments Samantha: 'ఏమాయ చేసావె' సినిమా ఇద్దరికి లైఫ్ ఇచ్చింది. అందులో ఒకరు స్టార్ హీరోయిన్ సమంత కాగా.. మరొకరు సింగర్ చిన్మయి శ్రీపాద. ఈ సినిమాలో సమంత పోషించిన జెస్సీ పాత్ర అందరికీ గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం చిన్మయి అందించిన హస్కీ వాయిస్ కూడా ఓ కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సామ్ స్క్రీన్‌పై పలికించిన అందమైన హావభావాలకు.. తెర వెనుక చిన్మయి అందించిన వాయిస్ బాగా ప్లస్ అయింది. మొత్తానికి సామ్ అందం, నటన.. చిన్మయి వాయిస్ జెస్సీ పాత్రకు ప్రాణం పోశాయి.
ఏమాయ చేసావె సినిమా తర్వాత సమంత నటించిన చాలా చిత్రాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రంమలోనే వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు. కలిసి బయట కూడా చాలాసార్లే కనిపించారు. అయితే సామ్, చిన్మయికి చెడిందని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. ఈ విషయంపై తాజాగా చిన్మయి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి మాట్లాడుతూ... 'నెట్టింట వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను, సామ్ బాగానే ఉన్నాము. మేమిద్దరం కలిసినప్పుడల్లా ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టకపోయినంత మాత్రాన విడిపోయినట్లు కాదు' అని అన్నారు.
'నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడం ఇష్టం ఉండదు. సమంత, నేను కలిసి మాట్లాడుకున్నాం.. డిన్నర్‌కు వెళ్లాం అని చెప్పడం వల్ల ఎవరికి లాభం? చెప్పండి. మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం. సామ్ ఎంతో మంచి వ్యక్తి. తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నేను రాణించడానికి ఆమె కారణం. ఇప్పుడు సామ్ తనపాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇక సమంతతో నా డబ్బింగ్ ప్రయాణం ముగిసినట్టే అని నేను అనుకుంటున్నా' అని చిన్మయి శ్రీపాద పేర్కొన్నారు.
Also Read: Alia Bhatt Telugu Song: తెలుగు పాట పాడిన ఆలియా భట్.. నాగార్జున, ఎన్టీఆర్ ఫిదా!
Also Read: 8 ఎకరాల ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసిన కోహ్లీ, అనుష్క.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook