Case on Devi sri prasad: ఎరక్కపోయి ఇరుకున్న దేవి శ్రీ ప్రసాద్.. బూతు సాంగ్లో పవిత్ర మంత్రం.. కరాటే కళ్యాణి ఘాటు వార్నింగ్!

Devi Sri Prasad Police Case: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మీద పోలీసులకు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఆమెతో కలిసి పలు హిందూ సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 2, 2022, 05:48 PM IST
Case on Devi sri prasad: ఎరక్కపోయి ఇరుకున్న దేవి శ్రీ ప్రసాద్.. బూతు సాంగ్లో పవిత్ర మంత్రం.. కరాటే కళ్యాణి  ఘాటు వార్నింగ్!

Devi Sri Prasad Police Case: టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు దేవి శ్రీ ప్రసాద్. టాలీవుడ్ కు మాత్రమే కాక తమిళ హిందీ సినిమాలకు కూడా ఆయన సంగీతం అందిస్తూ ఉంటారు. అయితే కొంతకాలంగా సరైన హిట్టు లేక బాధపడుతున్నా సరే ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూనే వెళ్లిపోతున్నాడు. చివరిగా పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన తర్వాత సరైన హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా హిందీలో ఆయన ఓ పారి అనే పాప్ ఆల్బమ్ రిలీజ్ చేశారు. విదేశీ మోడల్స్ తో కలిసి దేవిశ్రీప్రసాద్ స్టెప్పులు వేస్తూ ఆడిపాడి హడావుడి చేస్తూ ఆ ఆల్బమ్ తయారు చేశాడు. భారీ బడ్జెట్ తో స్పెయిన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ సాంగ్ షూటింగ్ కూడా చేశారు. ఈ సాంగ్ కు సంబంధించిన అన్ని బాధ్యతలు తానే చూసుకున్న దేవిశ్రీప్రసాద్ ఎట్టకేలకు ఈ సాంగ్ రిలీజ్ చేశాడు కానీ అభిమానులకు మాత్రం ఈ సాంగ్ అంతగా నచ్చలేదు.

సాంగ్ కొరియోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని సాంగ్ చూసిన వారందరూ పెదవి విరుస్తున్నారు. రాక్ స్టార్ అని పేరున్న దేవి శ్రీ ప్రసాద్ నుంచి ఒక ఆల్బమ్ వచ్చిందంటే అద్భుతంగా ఉంటుందని ఆశించారు కానీ ఇది ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో వారందరూ నిరాశ పాలయ్యారు. అయితే ఈ ఆల్బమ్ విషయంలో ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ఇబ్బందుల్లో పడ్డాడు, తాజాగా దేవిశ్రీప్రసాద్ మీద సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు అందింది. దేవిశ్రీప్రసాద్ సినీనటి కరాటే కళ్యాణి సహా పలు హిందూ సంఘాల వారు ఫిర్యాదు చేశారు.

ఓ పారి ఆల్బంలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఉపయోగించారని, దేవుడి పాటని ఐటెం సాంగ్ లో చితిరేకరించడం ఏమాత్రం బాలేదని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష్ణ మంత్రం పై అశ్లీలమైన దుస్తులు నృత్యాలతో పాట చిత్రీకరించిన దేవిశ్రీప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవి శ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని లేకపోతే దేవిశ్రీప్రసాద్ కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామని కరాటే కళ్యాణి హెచ్చరించారు. మరి ఈ విషయం మీద దేవి శ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read: Sohail Kathuria Biodata: అసలు ఎవరీ సోహైల్ కతూరియా.. హన్సికను ఎలా పడేశాడో తెలుసా?

Also Read: Pavala Shyamala : కరాటే కళ్యాణిపై పావలా శ్యామల షాకింగ్ కామెంట్స్.. అసహ్యం వేసిందంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News