Prabhas: మరోసారి ఆ డైరెక్టర్ ని ప్రభాస్ నమ్ముతారా? పెద్ద రిస్క్ అంటున్న అభిమానులు

Prabhas Next Movie: బాహుబలి రేంజ్ సక్సెస్ తరువాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సమయంలో సుజీత్.. సాహో సినిమాతో అభిమానులను సైతం నిరాశపరిచారు. కానీ తాజాగా ఇప్పుడు సుజిత్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. కానీ సుజిత్ కి సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి.. ప్రభాస్ సిద్ధంగానే ఉన్నారా..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 28, 2024, 08:30 PM IST
Prabhas: మరోసారి ఆ డైరెక్టర్ ని ప్రభాస్ నమ్ముతారా? పెద్ద రిస్క్ అంటున్న అభిమానులు

Prabhas Multistarrer Movie: సాహో సినిమాతో ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసిన సుజిత్ ప్రస్తుతం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ జి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక సుజిత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు కార్తికేయ హీరోగా భజే వాయు వేగం సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. 

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సుజిత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ప్రభాస్ తో ఒక యాక్షన్ కామెడీ సినిమా తీయాలని ఉందని అన్నారు. ఇప్పటిదాకా ప్రభాస్ సీరియస్ పాత్రలు మాత్రమే చేశారని అందుకే ఈసారి సినిమా తీస్తే ప్రభాస్ లోని హ్యూమరస్ సైడ్ చూపించడం మాత్రమే కాక బలుడు యాక్షన్స్ సన్నివేశాలతో థ్రిల్లింగ్ సినిమా తీస్తానని చెబుతున్నారు సుజిత్. ప్రస్తుతం సుజిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ సినిమా టాక్ మాత్రం చాలా వరకు నెగిటివ్ గానే ఉంది. అలాంటి సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ మళ్లీ సినిమా ఓకే చేస్తే అది నిజంగానే రిస్క్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో ప్రభాస్ ఈ రిస్క్ చేస్తారు అన్న నమ్మకం తక్కువే. 

ఇది చాలదు అన్నట్టు ప్రభాస్ పవన్ కళ్యాణ్ లు హీరోలుగా సుజిత్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇప్పటిదాకా ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా చేసిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ అయినా భీమ్లా నాయక్, గోపాల గోపాల వంటి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు కాబట్టి మళ్లీ సుజిత్ తో చేయడానికి అడ్డు చెప్పకపోవచ్చు. కానీ ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాకి ఒకే చెప్పటం కష్టమైన విషయం అని చెప్పుకోవాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలను ఒకే సినిమాలో చూడటం అభిమానులకు మాత్రం కన్నుల విందు గానే ఉంటుంది. మరి సుజిత్ కి ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో చూడాలి. 

అయితే ఓజీ సినిమా హిట్ అయితే పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్ కి కూడా మళ్లీ సుజిత్ తో సినిమా చేయడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి సుజిత్ మంచి కథతో ఈ ఇద్దరు హీరోలను సంప్రదిస్తే సినిమా వర్కౌట్ అవ్వచ్చు.

Also Read: Riyan Parag: చిక్కుల్లో క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌.. హీరోయిన్ల హాట్‌ వీడియోలు వెతుకుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా

Also Read: Mandi Biryani: పెళ్లి రోజు చావుకొచ్చింది.. మండీ బిర్యానీ తిన్న కుటుంబం ఆస్పత్రిపాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News