ButtaBomma Song: బుట్టబొమ్మ సాంగ్ సరికొత్త రికార్డు

Butta Bomma Song Record :అల్లు అర్జున్, పూజా హేగ్డే కాంబినేషన్‌లో వచ్చిన బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమాలోని ఈ పాట తెలుగు ప్రేక్షకులతో పాటు భారత దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఫేవరిట్‌గా మారింది.

Last Updated : Jul 10, 2020, 06:51 PM IST
ButtaBomma Song: బుట్టబొమ్మ సాంగ్ సరికొత్త రికార్డు

Most Viewed Song In TFI: అల్లు అర్జున్ ( Allu Arjun ) , పూజా హేగ్డే కాంబినేషన్‌లో వచ్చిన బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో #AVPL సినిమాలోని ఈ పాట తెలుగు ప్రేక్షకులతో పాటు భారత దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఫేవరిట్‌గా మారింది. సినిమా విడుదలైనప్పుటి నుంచి ఈ పాటకు అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 260 మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో (TFI ) అత్యధిక వ్యూస్ సంపాదించిన పాటగా రికార్డు క్రియేట్ చేసింది. దీనిని #MostViewedSongInTFI , #ButtaBomma అనే హ్యాష్ ట్యాగ్‌లతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ పాటకు ఇప్పటి వరకు 1.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి.  Also Read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

#Buttabomma :  బుట్టబొమ్మ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా మంది దీనికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు.

చిన్న పిల్లలు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు కొంత మంది షేర్ చేశారు.

ఈ చిన్నారి బుట్టబొమ్మ సాంగ్‌ చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తోందో...

  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

 #5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్

 

Trending News