Balakrishna: NBK109లో అదే హైలెట్.. సంబరం చేసుకుంటున్న నందమూరి అభిమానులు

NBK109: ఆరుపదుల వయసులో కూడా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో మంచి ఊపు మీద ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోరు కంటిన్యూ చేస్తూ బాలయ్య,బాబీ డైరెక్షన్లో ఓ మంచి యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏ మూవీ లో బాబీ బాలయ్యను ఓ రేంజ్ వింటేజ్ స్టైల్ లో చూపించబోతున్నట్లు టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 07:00 AM IST
Balakrishna: NBK109లో అదే హైలెట్.. సంబరం చేసుకుంటున్న నందమూరి అభిమానులు

NBK 109 Update: వరుస హ్యాట్రిక్ విజయాలతో బాక్సాఫీస్ బాక్స్ బద్దలు కొడుతున్నాడు బాలయ్య. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా వరుస క్రేజీ ప్రాజెక్టు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ ప్రస్తుతం బాలయ్య ఓ భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. బందిపోటు దొంగల బ్యాడ్ డ్రాప్ తో సాగే ఈ చిత్రం ను బాబీ భారీగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. 80 దశకంలో మొదలుపెట్టే స్లో రివెంజ్ డ్రామా గా సాగే ఈ మూవీ లో బాలయ్య వింటేజ్ గెటప్ అదుర్స్ అని ఫిలింనగర్ సమాచారం.

ఈ మూవీలో బాలయ్య తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్ర చాలా బలమైనదిగా ఉండడంతో పాటు బాలయ్య పాత్రకు కనెక్ట్ అయి ఉంటుందట. ఇందులో దుల్కర్ సల్మాన్ పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని టాక్. అయితే ఈ మూవీలో బాలయ్య కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రం థియేటర్ దద్దరిల్లిలే ఉంటాయట. బందిపోట్ల బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఆదర్శం అయిన షోలే మూవీలో గబ్బర్ సింగ్ ను అమితాబ్ బచ్చన్ ,ధర్మేంద్ర కలిసి ఎదుర్కొంటారు. అయితే అలాంటి సిచువేషన్ లో ఇద్దరి బదులు ఒక్క బాలయ్యే ఉంటే ఎలా ఉంటుందో అన్న పాయింట్ పై బాబీ ఈ కథను డెవలప్ చేశారని టాక్. ఇక ఇవన్నీ విని నందమూరి అభిమానులు తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. బాలకృష్ణకి మరో సూపర్ హిట్ ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా ఓ కీలకమైన పాత్ర పోషిస్తుంది. మూవీ కి సంబంధించి హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతం మూవీకి సంబంధించి జరుగుతున్న షెడ్యూల్స్ లో కొన్ని కీలకమైన ఫైట్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. కనీసం 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు రిలీజ్ డేట్ గురించి ఆలోచించుకోకూడదు అని మేకర్స్ భావిస్తున్నారు.

షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం పూర్తి అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి సందడి కి బాలయ్య సినిమా రెడీ అయిపోతుంది. బాలయ్యకు దసరా సెంటిమెంట్ ఉంది కాబట్టి ..ఒకవేళ అది ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా లేక బందిపోటుగా దర్శనం ఇస్తాడా అన్న విషయంపై క్లారిటీ లేదు. మొత్తానికి బాలయ్యని ఓ వింటేజ్ స్టైల్ లో చూడబోతున్నాం అని మాత్రం తెలుస్తోంది.

Also Read: WhatsApp Update: వాట్సాప్‌ యాప్‌లో కీలక మార్పు.. ఇకపై మీరు ఆ పని చేయలేరు

Also Read: HCA BMW Offer: హైదరాబాద్‌ క్రికెటర్లకు బంపరాఫర్‌.. రూ.కోటి నగదు, బీఎండబ్ల్యూ కారు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News