Bigg Boss Winner Sunny Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్‌గా ముగిసింది. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో టైటిల్ విన్నర్‌గా సన్నీ నిలిచాడు. అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. ఇంతకీ సన్నీ గెల్చుకున్న పారితోషికం మొత్తం ఎంతనేది తెలుసుకుందాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్(Bigg Boss Telugu Season 5 Title Winner)గా నిలిచిన సన్నీ ఒక్కడిగా వచ్చి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. 15 వారాలుగా నడిచిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. హౌస్‌లో ఎంటర్ అయినప్పటి నుంచి తనదైన ఆటతీరుతో పాటు ఎంటర్‌టైనర్‌గా నిలుస్తూ ప్రేక్షకుల్ని అలరించాడు. బయటి ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన యాంకర్ రవి ముందుగానే నిష్క్రమించాడు. సింగర్‌గా అందరికీ తెలిసిన శ్రీరామచంద్ర మూడో స్థానానికి పరిమితమయ్యాడు. కానీ బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని..ఓ సామాన్యుడిగా వచ్చిన సన్నీ మాత్రం చివరి వరకూ నిలిచాడు. టైటిల్ గెల్చుకున్నాడు. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో 14 వారాల్లో 14 మంది ఎలిమినేట్ కాగా, మిగిలిన ఐదుగురిలో మొదటి స్థానంలో నిలిచిన సన్నీ టైటిల్ గెల్చుకోగా, యూట్యూబర్ షణ్ముఖ్ రెండవ స్థానంలో నిలిచాడు. సింగర్ శ్రీరామచంద్ర(Sreee Rama chandra)మాత్రం మూడవ స్థానానికి పరిమితమయ్యాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సన్నీ..సత్తా చూపించాడు. అద్బుతమైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు.
ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ(Sunny) వాస్తవానికి పేజ్ 3 జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత వీడియో జాకీగా మారాడు. కొన్ని సీరియల్స్‌లో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. ఇప్పుడందరి దృష్టి బిగ్‌బాస్(BiggBoss)టైటిల్ విన్నర్‌గా సన్నీ ఎంత సంపాదించాడనేదే. ఎంత పారితోషికం(Suny Remuneration)వచ్చిందనేదే. వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ చొప్పున 15 వారాల్లో 30 లక్షలు గెల్చుకున్నాడు. ఇక టైటిల్ విన్నర్‌గా 50 లక్షల ప్రైజ్‌మనీ వచ్చింది. మరోవైపు సువర్ణభూమి తరపున 25 లక్షల విలువైన ప్లాట్ దక్కింది. రెండు లక్షల రూపాయల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్ గెల్చుకున్నాడు. ప్రైజ్‌మనీలోంచి 31.2 శాతం ఆదాయపు పన్ను మినహాయిస్తే..34.40 లక్షలు మాత్రమే చేతికి అందాయి. 15 వారాలకు సంపాదించిన 30 లక్షలు, సువర్ణభూమి ప్లాట్ విలువ, అపాచీ స్పోర్ట్స్ బైక్ కలుపుకుని 1 కోటి 8 లక్షల వరకూ సంపాదించాడని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook