Bigg Boss Telugu season 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లో నుంచి ఫస్ట్ బయటికి వచ్చేది నువ్వే అంటూ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్ కౌశల్ కామెంట్స్

Bigg Boss Telugu season 5:నటరాజ్‌ (Nataraj‌) మాస్టర్‌ జెస్సీని నామినేట్‌ చేస్తూ "చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్‌ చేస్తున్న" అని చెప్పగానే జెస్సీ కళ్ల వెంట నీళ్లు  పెట్టుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 08:13 PM IST
  • వైరల్ అవుతోన్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌ కామెంట్స్
  • తోటి మోడల్‌గా జెస్సీకి మద్దతుగా నిలిచిన కౌశల్‌
  • ఏడిస్తే హౌజ్‌ నుంచి అందరి కంటే ముందు బయటకు వస్తావంటూ హితవు
Bigg Boss Telugu season 5:  బిగ్‌బాస్‌ హౌజ్‌లో నుంచి ఫస్ట్  బయటికి వచ్చేది నువ్వే అంటూ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్ కౌశల్ కామెంట్స్

Bigg Boss Telugu season 5: బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్‌ ‌‌‌‌-5లో (Bigg Boss-5)నామినేషన్స్‌ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో నామినేట్‌ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల హౌజ్‌మెట్స్‌ చిన్నపాటి వాగ్వాదాలు జరిగాయి. హౌజ్‌లో ఎక్కువ మంది ఇంటి సభ్యులు జెస్సీని (Jessi) నామినేట్‌ (nominate) చేశారు. జెస్సీ మాట్లాడిన తీరు తమకు నచ్చలేదంటూ కొందరు తమ అభిప్రాయం తెలుపుతూ నామినేషన్ చేశారు. హమీదాతో పాటు  విశ్వ, యానీ మాస్టార్‌ అతడిని ఎలిమినేషన్‌కి (Elimination‌) నామినేట్‌ చేశారు. ఆ సమయంలో జెస్సీ ఎమోషనల్‌కు గురయ్యాడు. అలాగే నామినేషన్‌ సమయంలో విశ్వకు, జెస్సీకి మధ్య జరిగిన డిస్కషన్‌లో జెస్సీ బాధపడ్డారు. నటరాజ్‌ (Nataraj‌) మాస్టర్‌ కూడా జెస్సీని నామినేట్‌ చేస్తూ "చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్‌ చేస్తున్న" అని చెప్పగానే జెస్సీ కళ్ల వెంట నీళ్లు  పెట్టుకున్నాడు.

Also Read : వాళ్లిద్దరి ఒంటిపై దుస్తులతో సహా అన్ని లాకెళ్లిన బిగ్ బాస్! ఏం జరిగిందంటే..

అందరి కంటే ముందు నువ్వే బయటకు వెళ్తావు

దీంతో కొందరు హౌజ్‌మేట్స్ జెస్సీని ఓదార్చారు.  ఈ విషయంలో బిగ్‌బాస్‌‌-2 విజేత కౌశల్ జెస్సీకి మద్దతుగా నిలిచారు. ఇలా ఏడిస్తే హౌజ్‌ నుంచి అందరి కంటే ముందు నువ్వే బయటకు వెళ్తావు కౌశల్‌ పోస్ట్ పెట్టారు. కాగా జెస్సీ మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో హౌజ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.  మోడలింగ్ రంగం నుంచి నేను, అలీ రెజా తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది నువ్వే అంటూ కౌశల్‌.. జెస్సీని మెచ్చుకున్నారు. మోడల్స్  ఏడవకూడదు.  యాటిట్యూడ్‌తో పోరాటం చేయాలి. అయినా ఇలా స్టార్టింగ్‌లోనే నువ్వు ఏడిస్తే ఎలా.. త్వరగానే హౌజ్‌ నుంచి బయటకు వస్తావు అంటూ సలహా ఇచ్చారు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ అంటూ కౌశల్ జెస్సీకి మద్దతు పలికారు.  మరి జెస్సీ స్ట్రాంగ్‌గా హౌజ్‌లో ఉండి గేమ్‌ను మలుపు తిప్పుతూ బిగ్‌బాస్‌ (BiggBoos) హౌజ్‌లో పోరాడుతారా.. లేక మళ్లీ భావోద్వేగానికి గురై త్వరగా హౌజ్‌ నుంచి బయటకు వస్తారా చూడాలి.

Also Read : Anasuya Photos: "జబర్దస్త్" ఫోటోలతో అదరగొడుతున్న యాంకర్ అనసూయ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News