Bigg Boss Telugu season 5: కాజల్‌ వీడియోలు అన్నీ చూసేశానన్న నాగ్.. వారిద్దరూ సేఫ్‌, డేంజర్‌‌ జోన్‌లో ఆ నలుగురు

Nagarjuna said I watched all the Kajal videos : బిగ్‌బాస్‌ హౌజ్‌ను కాస్త కూల్‌ చేసేందుకు వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చేశారు. నాగార్జున బిగ్‌బాస్‌ హౌజ్‌లోని స్క్రీన్‌పై కనపడగానే హౌజ్‌మేట్స్‌ లోని ఫిమేల్‌ కంటెస్టెంట్ల అంతా గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అంటూ పాట అందుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2021, 12:16 PM IST
  • రసవత్తరంగా సాగుతోన్న బిగ్‌బాగ్‌ సీజన్‌ ‌‌5
  • హౌజ్‌మెంబర్స్‌పై నాగార్జున కామెంట్స్‌
  • కాజల్ గుట్టురట్టు చేసిన కింగ్‌
Bigg Boss Telugu season 5: కాజల్‌ వీడియోలు అన్నీ చూసేశానన్న నాగ్.. వారిద్దరూ సేఫ్‌, డేంజర్‌‌ జోన్‌లో ఆ నలుగురు

Bigg Boss Telugu 5 Nagarjuna said I watched all the Kajal videos: బిగ్‌బాగ్‌ సీజన్‌ ‌‌5 స్టార్టింగ్‌లోనే రసవత్తరంగా సాగుతోంది. హౌజ్‌లోని మెంబర్స్ మధ్య పోటీ ప్రారంభంలోనే మొదలైంది. కొంత మంది మధ్య అప్పుడే భేదాభిప్రాయాలు వచ్చాయి. నువ్వెంత అంటే.. నువ్వెంత అనే స్థాయికి మాటలు వెళ్లాయి. మరి ఇలాంటి అలా హాట్ హాట్ మారిన బిగ్‌బాస్‌ హౌజ్‌ను కాస్త కూల్‌ చేసేందుకు వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చేశారు. నాగార్జున బిగ్‌బాస్‌ హౌజ్‌లోని (Biggboss House) స్క్రీన్‌పై కనపడగానే హౌజ్‌మేట్స్‌ లోని ఫిమేల్‌ కంటెస్టెంట్ల అంతా గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అంటూ పాట అందుకున్నారు. ఆ పాటకు నాగార్జున కూడా మెస్మరైజ్ అయ్యారు.

బ్రీప్​ రివ్యూ

తర్వాత నాగ్‌ కంటెస్టెంట్ల అందరి మీద బ్రీప్​ రివ్యూ ఇచ్చారు. ఉమాదేవి కోపంపై, కాజల్‌ చురకుదనంపై, లహరి ఇరిటేషన్‌పై, జెస్సీ అగౌరవం విధానంపై కాసేపు మాట్లాడారు. లోబో బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌ చేసే తీరును మెచ్చుకున్నారు కింగ్. ఇక సరయూ విషయానికొచ్చేసరికి "ఏం నాకేమీ బూతులు వినపడలేదే.. జాగ్రత్తగా ఉన్నావా" అని అన్నారు నాగ్. అయితే.. మీరు తిడతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉన్నానన్న సరయూను.. నువ్వు నీలా ఉండు సరయూ (Sarayu) అని సజెషన్ ఇచ్చారు కింగ్. ఇక షణ్నూను అరేయ్‌ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా, ఆట మొదలెట్రా అన్నారు. కాజల్‌ (Kajal) హౌస్‌లో మ్యాట్రీమొనీ సర్వీసెస్‌ నడిపిస్తున్నట్లు ఉందని నాగ్‌ సెటైర్‌ వేశారు. జెస్సీని భయపడొద్దని హౌజ్‌లో బాగానే ఉంటున్నావని మెచ్చుకున్నారు.

 

కాజల్‌తో కట్
బిగ్‌బాస్ హౌజ్‌మేట్స్‌కు ఎవరితో సెట్‌? ఎవరితో కట్‌? అనే టాస్క్‌ ఇచ్చారు. సెట్‌ అనుకునేవాళ్లకు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టి, కట్‌ అనుకునేవాళ్ల ఫొటోలను చింపేయాలి ఈ టాస్క్‌లో. ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌ అయిన విశ్వతో (Viswa) మొదలైంది ఈ టాస్క్. తనకు మానస్‌ సెట్‌ అని బ్యాండ్ కట్టేశాడు. ఇక ఇంటి పనులు చేయనని తప్పించుకుని తిరిగే కాజల్‌తో కట్‌ అని చెప్పాడు విశ్వ.

Also Read : Chief Justice NV Ramana: భారత న్యాయస్థానాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ

కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలపై నాగ్ కామెంట్
అప్పుడు నాగ్‌... కాజల్‌కు సంబంధించిన ఒక సీక్రెట్ రివీల్‌ చేశారు. ఏంటీ కాజల్‌ వంట రాదు అన్నావ్‌.. మరి మేము నీ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) చూస్తే అన్నీ వంటకు సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి అనగానే కాజల్‌ షాక్ అయ్యింది. అది కాదు సార్.. అవన్నీ లాక్‌డౌన్‌ (Lockdown) టైమ్‌లో యూట్యూబ్‌లో చూస్తూ చేసినవని, సొంతంగా నాకు వంటలు రావు అని చెప్పింది కాజల్. మొత్తానికి కాజల్‌ అలా బుక్ అయ్యింది నాగ్ దగ్గర.

ఆ నలుగురు అన్‌సేఫ్‌
ఆ తర్వాత బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ (Bigg Boss Telugu season 5) కంటెస్టెంట్లు అంతా ఎవరితో సెట్‌? ఎవరితో కట్ టాస్క్ ఆడారు. ఒక్కొక్కరు ఒక్కొరితో సెట్ అంటూ ఎమోషనల్ అయ్యారు. కొందరేమే కట్‌ విషయంలో కాస్త గట్టిగానే అవతలి వారిపై ఫైర్ అయిపోయారు. కాగా తర్వాత జరిగిన నామినేషన్స్‌లో ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు సేఫ్‌ అయ్యారు. మానస్‌, కాజల్‌, సరయూ, జెస్సీ డేంజర్‌ అన్‌ సేఫ్‌ అయ్యారు. డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. మరి వీరిలో నాగ్‌ ఎవర్ని సేవ్‌ చేస్తారు, ఎవరిని ఎలిమినేట్‌ చేస్తారనేది చూడాలి. ఇక ఇవాల్టి ఎపిసోడ్‌ కూడా చాలా రసవత్తరంగానే సాగనుంది.

Also Read : Gold Smuggling: బంగారాన్ని అలా కూడా స్మగుల్ చేస్తారా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News