Bigg Boss Himaja : సంక్రాంతి సంబరాలు రెట్టింపు.. కొత్త కారు కొన్న బిగ్ బాస్ హిమజ

Bigg Boss Himaja New Car బిగ్ బాస్ షోతో హిమజ ఎక్కువగా ఫేమస్ అయింది. మూడో సీజన్‌లో వచ్చిన హిమజ.. ఇప్పుడు పలు షోలు, సినిమాలు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 12:32 PM IST
  • సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్
  • కొత్త కారుకొన్న హిమజ
  • ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Himaja : సంక్రాంతి సంబరాలు రెట్టింపు.. కొత్త కారు కొన్న బిగ్ బాస్ హిమజ

Bigg Boss Himaja New Car బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడుతుంటుంది. బిగ్ బాస్ షో వల్ల కెరీర్ పూర్తిగా ఏమీ మారిపోదు కానీ నెట్టింట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. కొంత మంది కంటెస్టెంట్లు తమ తమ యాక్టివిటీస్‌తో ఆ క్రేజ్‌ను కాపాడుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ వల్ల జనాల్లోకి వచ్చిన కంటెస్టెంట్లు ఉంటారు.. జనాలకు దూరంగా కనిపించకుండా పోయిన కంటెస్టెంట్లు కూడా ఉంటారు. అయితే మూడో సీజన్ కంటెస్టెంట్లైన అషూ రెడ్డి, శివ జ్యోతి, హిమజ, రోహిణి వంటి వారు మాత్రం ఇప్పటికీ మంచి డిమాండ్‌తో ముందుకు పోతోన్నారు.

మూడో సీజన్‌లో ఎక్కువగా లేడీ కంటెస్టెంట్లే ఫేమస్ అయ్యారు. అందులో శివ జ్యోతి, హిమజ, అషూ రెడ్డి, రోహిణి వంటివారున్నారు. ఇందులో ఇప్పటికే శివ జ్యోతి ఇళ్లు, కారు కొనేసింది. హిమజ సైతం కొత్తింటిని కట్టించుకుంటోంది. ఇది వరకు ఓ కారును కూడా కొనేసింది. మళ్లీ ఇప్పుడు ఇంకో కారుని కూడా కొనేసినట్టు చెప్పుకొచ్చింది. ఈ సంక్రాంతి స్పెషల్‌గా తన కుటుంబం కోసం ఈ కారుని కొన్నట్టుగా హిమజ పేర్కొంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Himaja💫 (@itshimaja)

హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీని ఇలా సర్ ప్రైజ్ చేశాను.. వారి సౌలభ్యమే నాకు ముఖ్యం.. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైందంటూ తన అభిమానుల మీద ప్రేమను కురిపించింది హిమజ. అయితే హిమజ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.

హిమజ పెళ్లి విషయం మీద రూమర్లు వస్తుంటాయి. ఇక ఇళ్లు, కారు కొనుక్కోవడం, లగ్జరీగా తిరగడం, వెకేషన్లకు వెళ్లడం మీద కొంత మంది నెగెటివ్ కామెంట్ చేస్తుంటారు. ఇదంతా తన కష్టార్జితం అని, ఎవ్వడూ తనకు ఉదారంగా ఇవ్వలేదంటూ ట్రోలర్లకు హిమజ గట్టిగా కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా హిమజ కొన్ని కారు విలువ నలభై నుంచి యాభై లక్షలు ఉండేట్టు కనిపిస్తోంది.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News