Bigg Boss Arohi : అక్కా.. అలాంటి బట్టలెందుకు వేసుకుంటావ్?.. ఆరోహి కోసం అభిమానుల ఆవేదన ఇదే

Bigg Boss Arohi Rao Dress బిగ్ బాస్ షోతో ఆరోహి బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇస్మార్ట్ న్యూస్ అంటూ యూట్యూబ్‌లో సందడి చేసేది. అయితే బిగ్ బాస్ షోలో ఆరోహి చేసిన కామెంట్లు, ఏడ్చిన ఏడ్పులు అందరికీ తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 04:01 PM IST
  • నెట్టింట్లో ఆరోహి సందడి
  • ఆరోహి డ్రెస్సింగ్ మీద చర్చలు
  • వద్దని వేడుకున్న ఆరోహి అభిమానులు
Bigg Boss Arohi : అక్కా.. అలాంటి బట్టలెందుకు వేసుకుంటావ్?.. ఆరోహి కోసం అభిమానుల ఆవేదన ఇదే

Bigg Boss Arohi Rao Dress ఆడవాళ్లు ధరించే వస్త్రాధారణ మీద ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. పొట్టి బట్టలు వేసుకునే సెలెబ్రిటీల మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తూనే ఉంటుంది. అయితే ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం. ఎవరికి నచ్చిన, కంఫర్ట్‌గా ఉన్న దుస్తులనే వారు ధరిస్తారు. ఇలా ఎందుకు ధరించావ్.. ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావ్? అని ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. హీరోయిన్లకు ఇలాంటి తిప్పలు ఎలాగూ తప్పవు. ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి డ్రెస్సింగ్‌ మీద చర్చలు జరుగుతున్నాయి.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో ఆరోహి పొట్టి బట్టల్లో కనిపించింది. కొన్ని సందర్భాల్లో అయితే పాంట్ వేసుకుందా? అనే అనుమానం వచ్చేలా ఆమె డ్రెస్సింగ్ కనిపించింది. ఆరోహి డ్రెస్సింగ్ మీద కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ఆరోహి కాస్త బోల్డ్ ఫోటో షూట్‌ను చేసింది. దీనిపై ఓ అభిమాని హర్ట్ అయ్యారు. అయితే ఫ్యాన్‌కు ఆరోహి అదిరిపోయేలా రిప్లై ఇచ్చింది.

డియర్ హేటర్స్.. ఇంకా నా పిచ్చి చాలా ఉంది.. మీకింకా చూపించాల్సింది చాలా ఉంది.. సహనంతో ఉండండి అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను, అందులో ఆమె ధరించిన డ్రెస్సు గురించి ఓ అభిమాని ఇలా అనేసింది. ఇవేమీ డ్రెస్సులు అక్కా.. అమ్మాయిల డ్రెస్సింగ్ బాగుంటేనే బాగుంటది.. నువ్వు నీ డ్రెస్సింగ్‌ను చేంజ్ చేసుకోవద్దు అని వేడుకుంది.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

దీనికి ఆరోహి ఇలా రిప్లై ఇచ్చింది. నేను నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయలేదు.. నా మూడ్, కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది.. బట్టల్లో ఏం ఉందిరా.. బ్రెయిన్‌లో ఉంటదంతా.. అని ఎంతో గొప్పగా రిప్లై ఇచ్చింది. చూసే విధానం తప్పు అని చెప్పకనే చెప్పేసింది ఆరోహి. అయితే ఆరోహి షేర్ చేసిన ఈ ఫోటో మీద కొంత మంది నెగెటివ్ కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంత మంది మాత్రం అదిరిపోయాయ్ అంటూ పొగిడేస్తున్నారు.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News