BB 7 House new Captain: మళ్లీ చక్రం తిప్పిన శివాజీ.. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా డాక్టర్ బాబు..

BB 7 Updates: గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యారు. అయితే మనోడు కెప్టెన్ అవ్వడంతో శివాజీ కీ రోల్ పోషించాడు. అసలు గౌతమ్ ఎలా కెప్టెన్ అయ్యాడు? ఇందులో శివాజీ పాత్ర ఏంటి? శోభా శెట్టి సైకో శెట్టిలా ఎందుకు మారింది? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 12:31 PM IST
BB 7 House new Captain: మళ్లీ చక్రం తిప్పిన శివాజీ.. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా డాక్టర్ బాబు..

Bigg Boss 7 Telugu new Captain: బిగ్ బాస్ హౌస్ ఇంటి కెప్టెన్ గా గౌతమ్ ఎంపికయ్యాడు. దీంతో కెప్టెన్ అయిన నాలుగో హౌస్ మేట్ గా గౌతమ్ నిలిచాడు. గతంలో పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్ అంబటి బిగ్ బాస్ హౌస్ సారథులగా వ్యవహారించారు. అయితే ఈసారి గౌతమ్ ను కెప్టెన్ ను చేయడంలో హీరో శివాజీ కీలకపాత్ర పోషించాడు. అదెలాగో చూద్దాం. 

సైకోగా మారిన శోభా.. 
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా రసవత్తరంగా సాగింది. నామినేషన్స్ లోనే మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య వాడీవేడీగా వాదనలు జరిగాయి. ముఖ్యంగా శోభా-యావర్ మధ్య అయితే పెద్ద గొడవ అయింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్కుల్లో గెలిచి కెప్టెన్ రేసులో నిలిచారు ప్రియాంక, శోభా, ప్రశాంత్, గౌతమ్ మరియు సందీప్. అయితే ఈ పోటీదారులలో ఎవరు కెప్టెన్‌గా అనర్హులో చెప్పి.. వాళ్ల మెడలో మిర్చి దండ వేయాలని బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. అయితే ఈ టాస్క్‌లో.. తేజా, అమర్‌లు పల్లవి ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేసి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు. యావర్, రతికాలు అయితే శోభాశెట్టిని... భోలే, అశ్వినీలు ప్రియాంకను రేసు నుంచి తొలగించారు. ఈ క్రమంలో శోభాశెట్టి కాస్తా సైకో శెట్టిలా మారిపోయింది. ముఖ్యంగా యావర్ ను పిచ్చోడంటూ రెచ్చిపోయింది. 

చక్రం తిప్పిన శివాజీ..
ఫైనల్‌గా ఓటు వేసేందుకు శివాజీ, అర్జున్‌లు మిగిలారు. ఈ క్రమంలో మెుదటగా అర్జున్ ఓ చిన్న సిల్లీ రీజన్ చెప్పి సందీప్ మెడలో మిర్చి దండ వేశాడు. ఇక చివరగా కెప్టెన్ ను నిర్ణయించేది శివన్న ఓటు. ఈ ప్రోసెస్ లో ఎవరూ ఊహించని విధంగా సందీప్ మెడలో మిర్చి దండ వేసి.. అతన్ని కెప్టెన్సీ రేస్‌ నుంచి తప్పించాడు శివాజీ. దీంతో గౌతమ్ కెప్టెన్ అయ్యాడు. 

అయితే గౌతమ్ కు మెుదటి నుంచి శివాజీ పై నెగిటివ్ అభిప్రాయం ఉంది. కొంత మందికే సపోర్టు చేస్తారు, తనకు మద్దతు ఇవ్వరని గౌతమ్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత రెండు వారాలుగా గౌతమ్ శివాజీని ఏదో కారణం చెప్పి నామినేట్ చేస్తూ వస్తున్నాడు. అయితే శివాజీ మాత్రం అవేమీ మనసుకు తీసుకోకుండా తన ఓటుతో గౌతమ్ ను ఇంటి కెప్టెన్ చేసి మరోసారి కింగ్ మేకర్ గా నిలిచాడు. అయితే ఇప్పటి వరకూ ఉప్పు నిప్పుగా ఉన్న శివాజీ-గౌతమ్‌లు ఈసారైనా ఒక్కటవుతారేమో చూడాలి. వచ్చే వారం కెప్టెన్‌గా హౌస్‌లో ఉండాలంటే.. ఈవారం నామినేషన్స్ లో ఉన్న గౌతమ్ సేవ్ కావాల్సి ఉంది. 

Also Read: Bigg Boss 7 Telugu: ఈ వారం హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్.. ఆమెను కాపాడేందుకేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News