Bigg Boss 7 Telugu: నాగార్జునను ప్రశ్నించిన శివాజీ.. శోభాను కడిగేసిన కింగ్..

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. శివాజీ పక్షపాతంగా ఉన్నారంటూ ఆరోపించిన శోభా శెట్టిపై నాగ్ ప్రశ్నల వర్షం కురిపించాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2023, 06:52 PM IST
Bigg Boss 7 Telugu: నాగార్జునను ప్రశ్నించిన శివాజీ.. శోభాను కడిగేసిన కింగ్..

Bigg Boss 7 Telugu Latest Promo: బిగ్‍బాస్ తెలుగు సీజన్ 7 ముందుగా చెప్పిన విధంగానే ఉల్టా పుల్టాగా సాగుతోంది. నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం ఫన్ తోపాటు కొన్ని ట్విస్టులు ఇచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ముందుగా బొమ్మ గియ్.. గెస్ చెయ్ అనే గేమ్ ను పెట్టారు. సినిమా పేరు చిట్టీలో ఇచ్చి ఓ కంటెస్టెంట్‍కు ఇస్తారు. ఆ కంటెస్టెంట్ బొమ్మ వేసి చూపించగా.. మిగతా వారు దానిని గెస్ చేయాలి. కంటెస్టెంట్లు చిత్ర విచిత్ర బొమ్మలు గీసినట్లు లేటేస్ట్ ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇది చాలా ఫన్ గా సాగినట్లు తెలుస్తోంది. 

"నేను ఎందుకు హౌస్‍మేట్‍గా అనర్హుడినో" చెప్పాలని నాగార్జునను శివాజీ ప్రశ్నించారు. మీరు పక్షపాతం(Partial)గా ఉన్నారని వారు భావించారని నాగ్ చెప్పారు. దీంతో తాను పక్షపాతం చూపలేదని.. మీరు సాక్ష్యం చూపించాలని నాగార్జునను అడిగారు. దీంతో శివాజీ పక్షపాతంతో ఉన్నారని చేయి ఎత్తిన శోభా శెట్టిని నాగార్జున ప్రశ్నించారు. అమర్, ప్రియాంక పేరు వస్తే తనను శివాజీ మాట్లాడనివ్వడం లేదని శోభ అనగా.. అమర్‌ను సపోర్ట్ చేయడానికి నీకు ఉన్న రీజన్ ఏంటో చెప్పాలని నాగ్ నిలదీశారు. అయితే, అమర్‌ను తాను సపోర్ట్ చేయడం లేదని శోభా బదులిచ్చింది. ఇప్పుడే కదా అమ్మ నువ్వు అన్నావని కింగ్ అన్నారు. 

ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంతి విషయంలో శివాజీ పక్షపాతంగా ఉన్నారని శోభా చెప్పింది. అలా అయితే యావర్ ఎందుకు నామినేట్ అవుతాడని నాగ్ ప్రశ్నించాడు. దీంతో శోభా నోటి నుంచి మాటలు రాలేదు. యావర్ విషయంలో గౌతమ్ కృష్ణను కూడా నాగ్ ప్రశ్నించారు. ఈ సీజన్ ఉల్టాపుల్టాగా సాగుతోందని...  ఎప్పుడూ జరగని విషయాలు జరుగుతాయని ప్రోమోలో చెప్పారు నాగ్. నాలుగో వారంలో రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News