Bigg Boss 7 Telugu: ఈ వీకెండ్ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న బిగ్ బాస్.. అది ఇదేనా?

BB 7 Telugu: ఈ వారం బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. గత వారం వీకెండ్ లో వెళ్తూ వెళ్తూ దీనికి సంబంధించిన ఓ చిన్న హింట్ కూడా ఇచ్చాడు. ఈ వీక్ నలుగురు హౌస్ లోకి వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 09:37 PM IST
Bigg Boss 7 Telugu: ఈ వీకెండ్ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న బిగ్ బాస్.. అది ఇదేనా?

Bigg Boss 7 Telugu latest promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 గత సీజన్లతో పోలిస్తే రసవత్తరంగా సాగుతోంది. రోజురోజూకు క్యూరియాసిటీని పెంచుతూ షో ను నడిపిస్తున్నారు నిర్వాహకులు. ముందుగానే చెప్పినట్లు ఈ సీజన్ ఉల్టా పుల్టాగా జరుగుతోంది. మెుత్తం 14 మంది హౌస్ లోకి ఎంట్రీ కాగా.. ఇప్పుడు 10 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటి వరకు పవరాస్త్ర గెలుచుకుని నలుగురు హౌస్మేట్స్ గా నిలిచారు. ఈ వారం వారి పవరాస్త్రాలు కూడా తీసుకుని.. కంటెస్టెంట్స్ ను చేసేశారు బిగ్ బాస్. ఇకపై అందరూ కెప్టెన్సీ కోసం పోటీపడాలని సూచించారు. 

అయితే నాలుగోవారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వెళ్తూ.. మీరు ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయని రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చారు. అయితే చెప్పినది వైల్డ్ కార్డు ఎంట్రీలు గురించేనని నెట్టింట వార్తలు జోరుందకున్నాయి. ఇక హౌస్ లో అడుగుపెట్టే వారిలో  అర్జున్ అంబాటి, అంజలి పవన్, సింగర్ భోలే షావలి, పూజా మూర్తి ఉండబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, రతిక రోజ్ కూడా హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. 

''సర్ ప్రైజ్ రోలర్ కోస్టర్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి. ఈ ఆదివారం బిగ్‏బాస్ ఇంట్లో విషయాలను నాగార్జున ఉల్టా పుల్టా చేయనున్నారు. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఊహించని ట్విస్ట్ కోసం రెడీగా ఉండండి'' అంటూ తాజాగా స్టార్ మా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈసారి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News