Bigg Boss 4 Telugu Winner: హిస్టరీ రిపీట్ కానుందా.. అద్భుతం జరగనుందా!

బబిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరికొన్ని గంటల్లో ముగియనుంది. సంబరాలలో తేలేదెవరు, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే గత మూడు సీజన్లలో ఎంతగా ప్రయత్నించినా తమకు టైటిల్ దక్కలేదని, ఈసారి ఎలాగైన తమకే ట్రోఫీ లభిస్తుందని మహిళా ప్రేక్షకులు భావిస్తున్నారు.

Last Updated : Dec 20, 2020, 04:39 PM IST
Bigg Boss 4 Telugu Winner: హిస్టరీ రిపీట్ కానుందా.. అద్భుతం జరగనుందా!

Bigg Boss 4 Telugu Winner: బబిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరికొన్ని గంటల్లో ముగియనుంది. సంబరాలలో తేలేదెవరు, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే గత మూడు సీజన్లలో ఎంతగా ప్రయత్నించినా తమకు టైటిల్ దక్కలేదని, ఈసారి ఎలాగైన తమకే ట్రోఫీ లభిస్తుందని మహిళా ప్రేక్షకులు భావిస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గమనిస్తే.. మహిళా కంటెస్టెంట్‌కు నాలుగో సీజన్ సైతం మరోసారి నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. చాలా వరకు అభిజిత్ బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ అవుతాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఒకవేళ అభిజిత్ (Abhijeet) విన్నర్ అవకపోయినా రేసులో సోహైల్ లేక నెగ్గే అవకాశం ఉందని బిగ్ బాస్ 4 ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ!

Bigg Boss Telugu 4లో దేత్తడి హారిక, అరియానా గ్లోరిలు తమ వంతుగా కష్టపడ్డారు. అయితే అరియానా చాలా వరకు డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె వ్యవహారశైలి ఎలాగున్నా సోలో గేమర్ అనే పేరు అయితే సంపాదించుకుంది. హారిక విషయానికొస్తే అభిజిత్ సపోర్ట్ లభించింది. ఓటింగ్‌లోనూ అది ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ చేసిందని అభిక ఫ్యాన్స్ ట్వీట్లు, పోస్టులు చేశారు.
Gallery: Eesha Rebba Photos: నటి ఈషా రెబ్బ క్యూట్ ఫొటోస్

తొలుత టాప్ 5 నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్స్‌లో ఒకరు లేడీ కంటెస్టెంట్ ఉండగా, మరొకరు అఖిల్ అయ్యే ఛాన్స్ ఉందని ఓటింగ్ శైలితో అర్థమవుతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏ విధంగా చూసినా అభిజిత్ లేక సోహైల్ టైటిల్ నెగ్గుతారని, అరియానా రన్నరప్‌గా నిలిచే అవకాశాలు సైతం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. 
Also Read: Lakshmi Manchu Daughter Vidya Nirvana: మంచు లక్ష్మి కుమార్తె అరుదైన ఘనత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News