Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..

Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు  బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని  కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2024, 06:40 AM IST
Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో  ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..

Article 370 OTT Streaming: గత కొన్నేళ్లుగా హిందీ సహా వివిధ సినీ ఇండస్ట్రీస్‌లో  మన దేశంపై జరిగిన జరుగుతోన్న దురాగతాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్', 'ది కేరళ స్టోరీ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాయి. ఇక 2019లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. ఎన్నో ఏళ్లుగా జమ్మూ కశ్మీర్‌ను దేశం నుంచి వేరు చేస్తోన్న ఆర్టికల్ 370ని అనే రాచపుండును  2019 ఆగష్టు 5న పార్లమెంటులో సాహోసోపేతంగా  ప్రవేశిపెట్టి తొలిగించింది. అంతేకాదు జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని.. జమ్ము కశ్మీర్‌గా, లద్దాక్‌గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది.  ఈ సంఘటలను బేస్ చేసుకొని 'యూరీ .. ది సర్జికల్ స్ట్రైక్' మూవీ డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ ఈ సినిమాను నిర్మించారు. ఈయనతో పాటు లోకేష్ ధర్, జ్యోతి దేశ్‌పాండే ఈ సినిమాకు సహ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఆదిత్య జంబాలే ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో యామీ గౌతమ్, ప్రియమణితో పాటు అరుణ్ గోవిల్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా ఫిబ్రబరి 23న విడుదలై మంచి బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. అప్పట్లో ఆర్టికల్ 370 పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనేది ఈ సినిమాలో చక్కగా ప్రెజెంట్ చేసాడు  దర్శకుడు.  

ఇప్పటికే బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటి నుంచి (18-4-2024) నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడని ప్రేక్షకులు ఎంచక్కా టీవీల్లో చూడొచ్చన్న మాట. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత
31 అక్టోబర్ 2019న సర్ధార్ పటేల్ జయంతి రోజున రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఎప్పుడు ఏదో ఒక గొడవతో సతమతమయ్యే అక్కడ ప్రాంత  ప్రజలు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి ప్రాంతంతో పాటు ప్రజల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

అక్కడ ప్రాంతంలో గణనీణమైన అభివృద్ది కనిపిస్తోంది. పర్యాటకులు కూడా జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.
ఇక కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో చేస్తోన్న అభివృద్దిని చూస్తూ పక్కనే ఉన్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా POJKను మన దేశంలో విలీనం చేయాలంటూ ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News