Anushka: అనుష్క సూపర్ స్కెచ్.. అందుకే చిరంజీవి సినిమాకి సైతం నో!

Ghaati: అనుష్క గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అరుంధతి సినిమాతో హీరోలకి ధీటుగా ఈ హీరోయిన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. అలాంటి అనుష్క ప్రస్తుతం సినిమాల తగ్గించడం వెనక పెద్ద స్కెచ్ ఉండట..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2024, 03:16 PM IST
Anushka: అనుష్క సూపర్ స్కెచ్.. అందుకే చిరంజీవి సినిమాకి సైతం నో!

Anushka Upcoming Movie: ఒకప్పుడు హీరోలకు దీటుగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క. అనుష్క అంటే అప్పట్లో హీరోకి పెట్టినంత డబ్బులు పెట్టి మరి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకు వచ్చేవారు. అలాంటి అనుష్క బాహుబలి సినిమా తరువాత సినిమాలు చేయడం మానేసింది. ముఖ్యంగా సైజ్ జీరో తర్వాత హీరోయిన్ కొన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకుంది.

ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యనే నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో స్వీటీ మళ్లీ తెలుగు సినిమాలలో కనిపిస్తుందని ఆమె అభిమానులు తెగ ఆశపడ్డారు. కానీ ఈ చిత్రం విడుదలై ఎన్నో నెలలు కావస్తోన్న అనుష్క మరో సినిమా ఇంకా విడుదల కాలేదు.

అయితే దీని వెనక పెద్ద స్కెచ్ ఉందని వినికిడి. అసలు విషయానికి వస్తే అనుష్క ఇకమీదట తన సినిమా కెరియర్ లో ఆచితూచి అడుగులు వేద్దాం అని ఫిక్స్ అయిందట. అరుంధతి చిత్రంతో తను సంపాదించుకున్న క్రేజ్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులకు అభిమానం మాత్రం ఎక్కువే. అంతేకాదు అనుష్క తప్పకుండా తన పాత్రకి ఎక్కువ విలువ ఉండే చిత్రాలే ఒప్పుకుంటుందని ఆమె అభిమానులకు నమ్మకం కూడా. ఆ నమ్మకాన్ని అనుష్క వమ్ము చేయకూడదు అని ఫిక్స్ అయ్యిందని సమాచారం.

చిరంజీవి విశ్వంభరకు సినిమాలో కూడా త్రిష కన్నా ముందు ఆ పాత్రను అనుష్కకి ఆఫర్ చేశారట. కానీ ఆ సినిమాలో ఆ పాత్రకి మరీ అంతా ఎలివేషన్ లేకపోవడం..మెయిన్ హీరోయిన్ తనే అయినప్పటికీ మరో ముగ్గురు స్క్రీన్ షేర్ చేసుకునే కథ కావడంతో అనుష్క ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. తాను సొంత కుటుంబంగా భావించే యువి క్రియేషన్స్ బ్యానర్ విశ్వంభర సినిమాని నిర్మిస్తున్న.. అవకాశం వచ్చింది చిరంజీవి సరసన అయినా సరే బాగా అలోచించి మన స్వీటీ సున్నితంగా నో చెప్పేసిందట.

ఈ క్రమంలో అనుష్క ఎలాంటి సినిమా ఒప్పుకుంటుంది అని ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్న టైం లో.. అందుకు తగ్గట్టుగానే క్రిష్ దర్శకత్వంలో ఘాటి సినిమా ప్రకటించింది. వేదంలో వేశ్యగా తనలో ఉత్తమ నటిని బయటికి తీసుకొచ్చిన దర్శకుడిగా క్రిష్ ని మరోసారి నమ్మింది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటిలకు చూస్తేనే ఈ చిత్రంలో అనుష్క ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతుందో అర్థమవుతుంది. ఈ చిత్రం కథ ప్రకారం అనుష్క అమాయకంగా మొదలై గంజాయి వ్యాపారంలో మాఫియా స్థాయికి ఎదిగిన ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ లో కనిపించనుంది అని టాక్. పెర్ఫార్మన్స్ కి ఎక్కువ అవకాశం ఉండటమే కాక సినిమా కథ మొత్తం తన చుట్టే తిరిగేది కావడంతో అనుష్క ఈ చిత్రం ఒప్పుకోవడానికి ఆలోచించలేదు. మరోపక్క మలయాళం డెబ్యూ కతనర్ లోనూ హారర్ టచ్ ఉన్న ఒక జానపద పాత్రను మన జేజమ్మ చేస్తోంది. అక్కడి తెరంగేట్రంలోనూ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టరే దక్కించుకుంది.

ఇక దీన్ని బట్టి చూస్తే అనుష్క ఎవరి సరసన నటిస్తున్నాను అనే దానికన్నా ఆ సినిమా ద్వారా తనకు ఎంత గుర్తింపు వస్తుంది అనేది ఆలోచిస్తోంది. కాగా  అనుష్క నుంచి రాబోతున్న ఘాటి, కథనర్ రెండూ ప్యాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఈ రెండు సినిమాలను కూడా హిందీతో సహా ప్రధాన భాషల్లో విడుదలకు ప్లాన్ చేయబోతున్నారు. క్రిష్ ఈ సంవత్సరం చివరిలోని ఘాటీ రిలీజ్ చేసేలా సెట్ చేస్తున్నారు. ఇక కతనర్ మాత్రం వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. ఇక ఇవి కాకుండా ఇప్పుడు ఎలా వేరే సినిమాలు ఒప్పుకునేలా లేదు అనుష్క.

Also Read:  మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌

Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News