Anchor Vindhya Vishaka : ఇన్ని కష్టాలు అనుభవిస్తోందా?.. తండ్రి గురించి తపన.. యాంకర్ వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్

Anchor Vindhya Vishaka Father యాంకర్ వింధ్యా విశాఖ తాజాగా తన తండ్రి గురించి చెబుతూ పోస్ట్ వేసింది. కిడ్నీ సమస్యలు, హార్ట్ ఎటాక్, డయాలిసిస్ అంటూ ఇలా కష్టాలను అనుభవిస్తోన్నట్టుగా చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2022, 08:24 AM IST
  • నెట్టింట్లో యాంకర్ వింధ్యా విశాఖ
  • తండ్రి గురించి తపన పడుతున్న యాంకర్
  • వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్
Anchor Vindhya Vishaka : ఇన్ని కష్టాలు అనుభవిస్తోందా?.. తండ్రి గురించి తపన.. యాంకర్ వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్

Anchor Vindhya Vishaka Father : యాంకర్ వింధ్యా విశాఖ బుల్లితెరపై బాగానే సందడి చేస్తుంటుంది. ఆ మధ్య యాంకర్ రవితో కలిసి ఓ షోలో కనిపించింది కవ్వించింది. యాంకర్ రవి, వింధ్యా విశాఖ కలిసి ఈటీవీ కోసం ఓ షోను చేశారు. మధ్యలోనే ఆపేశారు. నువ్వు రెడీ నేను రెడీ అంటూ రవి, వింధ్య కలిసి చేసిన ఈ షో మొదట్లో బాగానే నడిచినట్టుంది. కానీ ఆ తరువాత షోను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేదు. కానీ వింధ్యా మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. క్రికెట్ ప్రజెంటర్‌గా ఫుల్ బిజీగా తిరుగుతూ ఉంటుంది.

అలాంటి వింధ్యా విశాఖ తాజాగా తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. 'ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాస్తవాన్ని అంగీకరించడం నేను ఈ ఏడాది నేర్చుకున్నాను.. గత తొమ్మిదేళ్లుగా మా నాన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఓ దశకు వచ్చాక డయాలిసిస్ చేసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారు.. మధ్యలో ఆయన ఆరోగ్యం బాగానే ఉందనిపించింది.. కానీ కొన్ని సార్లు సీరియస్‌ కండీషన్‌లోకి వెళ్లింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka)

మళ్లీ ఆయనకు కొత్త ఇన్‌ఫెక్షన్లు సోకాయి. ఆయనకు భయం, ఆందోళన అనేవి ఎక్కువ అవ్వడంతో మరింతగా ఆరోగ్యం క్షీణించింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి సాయంతో రియాల్టీని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించాను. ఎందుకంటే అంతకు మించిన దారి నాకు కనిపించలేదు.. ఈ సమయంలోనే మా నాన్నతో నేను ఎక్కువ సమయం గడుపుతూ వచ్చాను.. ఇప్పుడు ఆయన వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేసుకుంటారు. 

ఇప్పుడు ఆయన కాస్త స్థిమితంగా ఉన్నాడు. నవంబర్‌ నెలలో నేను కంటిన్యూగా పని చేస్తుండటంతో నన్ను చూసేందుకు ముంబైకి వచ్చాడు. ఆయన మనోబలం, ఎప్పుడూ వెనుకడుగు వేయని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జీవితంలో ఈరోజు వచ్చే కష్టాలను మనం ఎదుర్కొంటేనే రేపటికి బలం వస్తుంది.. అంటూ తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.

Also Read : Jabardasth Punch Prasad : ఏడిపించిన పంచ్ ప్రసాద్.. ఫ్యామిలీ ఫోటోతో ఎమోషనల్.. మరీ ఇంత విషాదమా?

Also Read : Sujatha Rakesh : దుబాయ్‌లో ప్రేమ జంట.. సుజాత రాకేష్ పిక్స్.. జోర్దార్‌గా ఉందే వ్యవహారం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News