Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్

Anchor Suma Staff Members యాంకర్ సుమ తన స్టాఫ్‌తో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా తన టీంతో కలిసి చేసిన రీల్ వీడియో అందరినీ నవ్వించేస్తోంది. ఇందులో తన టీం డెడికేషన్ గురించి కూడా చెప్పకనే చెప్పేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 02:05 PM IST
  • నెట్టింట్లో యాంకర్ సుమ సందడి
  • స్టాఫ్ మెంబర్లతో సుమ రీల్ వీడియోలు
  • నెట్టి పడేసిన సుమ కనకాల
Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్

Anchor Suma Staff Members యాంకర్ సుమ మేకప్ మేన్, హెయిర్ స్టైలిష్ట్, ఇంట్లో వంట మనిషి ఇలా అందరూ సోషల్ మీడియాలో సుపరిచితులే. సుమ ఎప్పుడూ తన టీం మెంబర్ల గురించి చెబుతూనే ఉంటుంది. వారితో సుమ ఎంతో సరదాగా ఉంటుంది. అయితే సుమ ఇప్పుడు ఓ రీల్ వీడియో షేర్ చేసింది. సుమ చేసే రీల్ వీడియోలు ఎంతో వినోదాత్మకంగా ఉంటుండటంతో అవి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా తన టీంతో కలిసి సుమ చేసిన ఈ రీల్ వీడియో మరింత ఫన్నీగా ఉంది.

ఎంతో డెడికేషన్ ఉన్న టీం ఉంటే ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించింది. లీవ్ మీ ఎలోన్ అంటూ సాగుతున్న ట్రెండింగ్ వీడియోకు సుమ తాజాగా రీల్స్ చేసింది. ఇందులో తన టీం మెంబర్లంతా కూడా తనని వదలకుండా పనులు చేస్తున్నారన్నట్టుగా చూపించింది. నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ.. అందరినీ తోసి అవతలకు నెట్టేసింది సుమ.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

ఇక సుమ చేసిన ఈ ఫన్నీ రీల్ వీడియో అందరినీ మెప్పిస్తోంది. మామూలుగా అయితే సుమ ఇంట్లో తన పెట్ జోరోతో ఎక్కువగా రీల్స్ చేస్తుంటుంది. కరోనా సమయంలో అయితే సుమ ఎక్కువగా తన పెట్స్‌తోనే గడిపింది జోరో ఇప్పుడు బాగానే ఫేమస్ అయ్యాడు. హిట్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జోరో చేసిన సందడి, సుమ మీద జోరో కురిపించిన ప్రేమ అందరూ చూశారు.

సుమ వెండితెరపై మళ్లీ తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తోన్నట్టుగా కనిపిస్తోంది. జయమ్మ పంచాయితీ అనే సినిమా థియేటర్లో ఆడకపోయినా..ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక సుమ ఇప్పుడు ఓటీటీ సబ్జెక్టులను కూడా వింటున్నట్టుగా తెలుస్తోంది. సుమ తన కొడుకుని హీరోగా లాంచ్ చేసేందుకు కూడా రెడీ అయిన విషయం తెలిసిందే.

Also Read : HBD Venkatesh : వాటిలో వెంకీ మామ స్పెషలిస్ట్.. కెరీర్ మొత్తంలో ఎన్ని రీమేక్‌లు చేశాడంటే?

Also Read : VK Naresh Defamation Case : యూట్యూబ్‌ ఛానళ్లపై కేస్.. ట్రోల్స్ మీద పవిత్ర-నరేశ్‌ యుద్దం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News