Rashmi Gautam Swimming pool Video : స్విమ్మింగ్ పూల్‌లో యాంకర్ రష్మీ.. కనిపించకుండా కవర్ చేసిందిగా

Rashmi Gautam Swimming pool Video యాంకర్ రష్మీ తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో ఫుల్ చిల్ అవుతోంది. రష్మీ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వేడి పుట్టించేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 02:57 PM IST
  • నెట్టింట్లో యాంకర్ రష్మీ సందడి
  • వెకేషన్లో జబర్దస్త్ యాంకర్ రచ్చ
  • స్విమ్మింగ్ పూల్‌లో రష్మీ హల్చల్
Rashmi Gautam Swimming pool Video : స్విమ్మింగ్ పూల్‌లో యాంకర్ రష్మీ.. కనిపించకుండా కవర్ చేసిందిగా

Rashmi Gautam Swimming pool Video : యాంకర్ రష్మీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా థియేటర్లోకి వచ్చింది. కరోనా కంటే ముందు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. వాయిదా పడుతూ పడుతూ చివరకు విడుదలైంది. నందు, రష్మీల కెమిస్ట్రీ, పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. చివరకు సినిమా వచ్చింది పోయింది కూడా ఎవ్వరికీ తెలియకుండాపోయింది.

రష్మీ సోషల్ మీడియాలో కనిపించేదానికి, తెరపై చూసే దానికి ఎంతో తేడా ఉంటుంది. తెరపై గ్లామర్ షో చేస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనకు దూరంగానే ఉంటుంది. ఒకప్పుడు డబ్బు మాత్రమే కావాలంటూ. డబ్బు కోసం సినిమాలు చేస్తున్నాను.. ఎక్స్ పోజింగ్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడింది.కానీ రష్మీ మాత్రం ఇప్పుడు పిచ్చి పిచ్చి పాత్రలు చేసేందుకు అంగీకరించడం లేదు. అందాల ప్రదర్శనకు నో చెబుతోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

సోషల్ మీడియాలో రష్మీ పెట్స్ కోసం వేసిన పోస్ట్‌లు అందరినీ కదిలిస్తుంటాయి. పెట్స్ సంరక్షణ కోసం నిత్యం పాటు పడుతూనే ఉంటుంది. కుక్కలు, ఆవులు ఇలా ప్రతీ ఒక్క ప్రాణి కోసం పోరాడుతుంటుంది. జంతువుల హింసపై జరిగే వాటిని ఖండిస్తుంటుంది. ఈక్రమంలో రష్మీకి నెగెటివిటీ ఎదురవుతుంటుంది. అయినా కూడా రష్మీ మాత్రం తన పోరాటాన్ని ఆపదు.

ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. అలాంటి రష్మీ ప్రస్తుతం వెకేషన్లో ఫుల్ చిల్ అవుతోన్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న వీడియోను షేర్ చేసింది. కానీ ఇందులో తన అందాలేవీ కనిపించుకుండా జాగ్రత్త పడింది. దీంతో ఆమె తెలివిని చూసి అందరూ ముచ్చటపడుతున్నారు.

Also Read : Super Star Krishna Cardiac Arrest : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు.. క్రిటికల్ స్టేజ్.. వైద్యులు ఏమన్నారంటే

Also Read : Bigg Boss Vasanthi Buzz Interview : నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఆడిందేమీ లేదు.. వసంతి పరువుతీసిన యాంకర్ శివ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News