OTT పై యాంకర్ ప్రదీప్ సినిమా ?

యాంకర్ ప్రదీప్‌ ( Anchor Pradeep ) బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. టాలివుడ్ లేడి యాంకర్‌లలో సుమకి ( Anchor Suma ) ఎంత క్రేజ్ ఉందో మేల్ యాంకర్‌లలో ప్రదీప్ కూడా అంతే ఫాలోయింగ్ ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Last Updated : Aug 25, 2020, 11:08 PM IST
OTT పై యాంకర్ ప్రదీప్ సినిమా ?

యాంకర్ ప్రదీప్‌ ( Anchor Pradeep ) బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. టాలివుడ్ లేడి యాంకర్‌లలో సుమకి ( Anchor Suma ) ఎంత క్రేజ్ ఉందో మేల్ యాంకర్‌లలో ప్రదీప్ కూడా అంతే ఫాలోయింగ్ ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకు వెండితెరపై చిన్న చిన్న పాత్రలు పోషించిన ప్రదీప్ తన కెరీర్‌లో మొదటిసారి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? ( 30 rojullo preminchadam ela ) అనే సినిమాలో నటించాడు. మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. అదే సమయంలో కరోనావైరస్ వ్యాప్తి మొదలవడంతో అప్పటి నుంచి ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో మున్నా అనే డైరెక్టర్ టాలివుడ్‌కి పరిచయం కానున్నాడు. Also read : Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు

ఈ సినిమాలోని “నీలీ నీలి ఆకాశం” పాట ( Neeli neeli aakasam song )  విడుదలకి ముందే అద్భుతమైన విజయాన్ని సాధించింది. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఈ సాంగ్ 160 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్‌లను సొంతం చేసుకుంది. దీంతో ప్రదీప్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ సినిమా నిర్మాతలు కరోనా తీవ్రత తగ్గి థియేటర్‌లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని గత 6 నెలలుగా వేచి చూస్తున్నారు. కానీ అది జరగడం లేదు. Also read : Bigg Boss 4: జబర్ధస్త్ ఫేమ్ ఆర్టిస్టులకు ఆ ఒక్క ఛాన్స్ ?

అందుకే V సినిమా ( V Movie ) బాటలోనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా కూడా చివరకు OTT లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు చర్చలు జరుపుతునట్టు తెలుస్తోంది. త్వరలో ఒక ఒప్పందం ఖరారైతే.. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలిసే ఛాన్స్ ఉంది. Also read : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

Trending News