Anchor Anasuya in Pushpa movie: పుష్ప సినిమాలో పాత్రపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ అనసూయ

Anchor Anasuya in Pushpa movie: ఫేమస్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినప్పటికీ.. అది డీగ్లామరస్ రోల్ కావడంతో ఆమె సుకుమార్‌కు నో చెప్పిందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న తరుణంలో డీగ్లామరస్ రోల్స్ చేయడం రిస్క్ అవుతుందేమోననే ఉద్దేశంతో యాంకర్ అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.

Last Updated : Mar 2, 2021, 05:18 PM IST
  • Pushpa movie లో యాంకర్ అనసూయ పాత్రపై సోషల్ మీడియాలో భిన్న కథనాలు.
  • Director Sukumar ఇచ్చిన ఆఫర్‌కు యాంకర్ అనసూయ నో చెప్పినట్టుగా జరుగుతున్న ప్రచారం.
  • సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందించిన Anchor Anasuya
Anchor Anasuya in Pushpa movie: పుష్ప సినిమాలో పాత్రపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ అనసూయ

Anchor Anasuya in Pushpa movie: ఫేమస్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినప్పటికీ.. అది డీగ్లామరస్ రోల్ కావడంతో ఆమె సుకుమార్‌కు నో చెప్పిందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న తరుణంలో డీగ్లామరస్ రోల్స్ చేయడం రిస్క్ అవుతుందేమోననే ఉద్దేశంతో యాంకర్ అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. గతంలో సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా యాంకర్ అనసూయ (Anchor Anasuya as Rangammattha) పోషించిన పాత్రకు మంచి మార్కులే పడిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీలో కూడా ఓ కీలక పాత్ర కోసం యాంకర్ అనసూయను తీసుకోవాలని సుకుమార్ భావించినట్టు టాక్ వినిపించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. Pushpa movie కోసం ఇప్పటివరకు ఎవ్వరూ తనని సంప్రదించలేదని స్పష్టంచేసింది.

రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ముగించుకున్న అనంతరం హైదరాబాద్ వచ్చేసిన పుష్ప మూవీ యూనిట్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న Pushpa shooting లో పాల్గొంటోంది. Allu Arjun సరసన కన్నడ బ్యూటీ Rashmika Mandanna జంటగా నటిస్తోంది. Red sanders smuggling స్టోరీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న పుష్ప మూవీ అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీగా వస్తోంది. 

Also read : Ram Charan in Acharya shooting: ఆచార్య సెట్స్‌లో డాడీ Chiranjeevi తో రామ్ చరణ్ ఫోజ్

ఇక Anchor Anasuya Bharadwaj movies విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తండ మూవీ, చావు కబురు చల్లగా, ఖిలాడి సినిమాలు ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News