Amy Jackson: బ్రిటిష్ నటుడితో రామ్ చరణ్ హీరోయిన్ డేటింగ్!

Amy Jackson: నటి అమీ జాక్సన్ ఓ బ్రిటిష్ యాక్టర్ తో డేటింగ్ చేస్తున్న వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 01:20 PM IST
Amy Jackson: బ్రిటిష్ నటుడితో రామ్ చరణ్ హీరోయిన్ డేటింగ్!

Amy Jackson dating famous actor: బ్రిటీష్ నటి అమీ జాక్సన్ (Amy Jackson)  'మద్రాస పట్టణం' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరో ఆర్యతో జతకట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించటంతో.. వరుస ఆఫర్ల క్యూ కట్టాయి. 

ఆ తర్వాత ఆమె ధనుష్‌తో 'తంగమగన్', దళపతి విజయ్ 'తేరి', శంకర్ 'ఐ' చిత్రాల్లో నటించింది. ఈమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా 'ఏక్ దీవానా థా'. 'ఎవడు' (Yevadu) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత ఎమీ.. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించిన 'సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమాలో నటించింది. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ నటి.

తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ  ఓ బ్రిటిష్ యాక్టర్ తో డేటింగ్ చేయడం వైరల్ గా మారింది. ఇంతకముందు ఈ భామ జార్జ్ పనాయోటౌ (George Panayiotou) అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. కొడుకు పుట్టిన తర్వాత ఈ జంట మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. 

అయితే తాజాగా ఈ బ్యూటీ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో (Ed Westwick) డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు వారు ఏ ప్రకటన చేయలేదు. ‘'గాసిప్ గర్ల్‌'లో (Gossip Girl) అనే వెబ్ సిరీస్ తో వెస్ట్‌విక్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్‌లో సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. 

Also Read; Anushka Shetty Casting Couch: టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. నేను కూడా..! షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News