Pushpa Box Office: అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా పుష్ప గత ఏడాది విడుదలై సెన్షెషనల్ విజయాన్ని అందుకుంది. కరోనా సంక్షోభం ఉన్నా జనాలను థియేటర్లకు రప్పించిన మూవీగా నిలించింది. కలెక్షన పరంగానూ ఈమూవీ రికార్డులు సృష్టించి.. తెలుగు సినిమా సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాపై దేశవ్యాప్తంగా పెరిగిన అంచనాలను అందుకుందనడంలో సందేహం లేదు.
ఇప్పటి వరకు పుష్ప కలెక్షన్స్..
- నైజాం- 40.4 కోట్లు
- సీడెడ్- రూ.15.17 కోట్లు
- ఉత్తరాంద్ర- రూ.8.13 కోట్లు
- ఈస్ట్- రూ.4.89 కోట్లు
- వెస్ట్- రూ.3.95 కోట్లు
- గుంటూర్- రూ.5.13 కోట్లు
- నెల్లూర్- రూ.3.08 కోట్లు
తెలంగాణ ఆంధ్రాలో కలిపి మొత్తం రూ.85.35 కోట్లు రాబట్టింది పుష్ప ది రైస్. (తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ రూ.133.25 కోట్లు)
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- కర్ణాటక- 11.81 కోట్లు
- తమిళనాడు- రూ.13.75 కోట్లు
- కేరళ- రూ.5.60 కోట్లు
- హిందీ వెర్షన్- రూ.51.30 కోట్లు
- ఆర్ఓఐ-రూ.2.25 కోట్లు
- ఓవర్సిస్ షేర్- రూ.14.56 కోట్లు
- మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.184.62 కోట్లు కాగా మొత్తం గ్రాస్ (రూ.360 కోట్లు).
అల్లు అర్జున్ కెరీర్లోనే ఇవి అత్యంత భారీ కలెక్షన్లు కావడం విశేషం. అంతకు ముందు వచ్చిన అల వైకుంఠపురములో కూడా భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసింది.
పుష్ప సినిమా గురించి..
పుష్ప సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలైంది. అల్లు అర్జున్, రష్మికా మందాన్న హీరో, హీరోయిన్లు. వహాద్ ఫాజిల్, సులీల్, రావు రమేష్, అనసూయా సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా పాటలు గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.
Also read: Bheemla Nayak Hindi: హిందీలో భీమ్లా నాయక్ జోరు.. మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ విడుదల!
Also read: Sebastian PC 524 Review: సెబాస్టియన్ సినిమా ఎలా ఉంది? హీరో కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ సాధించారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook