Allu Arjun : రామ్ చరణ్‌కు విషెస్ చెప్పని బన్నీ!.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మరింత గ్యాప్?

Ram Charan Birthday రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. అయితే రామ్ చరణ్‌కు విషెస్ చెప్పని హీరోలుగా టాలీవుడ్‌లో ఓ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్‌లు రామ్ చరణ్‌కు విషెస్ చెప్పలేదని సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 11:44 AM IST
  • రామ్ చరణ్‌ బర్త్ డే స్పెషల్
  • స్పందించిన టాలీవుడ్ సెలెబ్రిటీలు
  • విషెస్ చెప్పని అల్లు అర్జున్
Allu Arjun : రామ్ చరణ్‌కు విషెస్ చెప్పని బన్నీ!.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మరింత గ్యాప్?

Allu Arjun Did not Wishes Ram Charan మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలున్నాయనే రూమర్లు ఎప్పటి నుంచో వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాటిని ఎప్పటికప్పుడు అల్లు అరవింద్, ఇతర సభ్యులో ఖండిస్తుంటారు. మాటలు ఒకలా ఉన్నా.. చేతలు ఇంకోలా ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. అల్లు అర్జున్ అయితే మెగా అనే మాటను కూడా తన నోటి నుంచి బయటకు రానివ్వడం లేదు. ఎంత సేపు అల్లు బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ వంటి పేర్లు పలకడం ఎప్పుడో మానేసినట్టుగా కనిపిస్తుంది.

ఇక బన్నీ సౌతం మెగా కాంపౌండ్, మెగా హీరో అనే ట్యాగ్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడని, ఇప్పుడు పూర్తిగా మెగా నీడ నుంచి వెళ్లిపోయినట్టుగా అర్థం అవుతోంది. రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకల్లో బన్నీ ఎక్కడా కనిపించలేదు. విదేశాల్లో ఉండి రాలేదని అనుకుంటే.. కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించలేదు. ట్విట్టర్‌లో ట్వీట్ గానీ, ఇన్ స్టా, ఫేస్ బుక్‌లో పోస్ట్ గానీ, కనీసం అందులో స్టోరీ గానీ పెట్టలేదు. రామ్ చరణ్‌కు పుట్టిన రోజు విషెస్ చెప్పనేలేదు.

అల్లు అర్జున్ కావాలనే ఇలా విషెస్ చెప్పలేదని ఓ వర్గం ఆయన మీద సీరియస్ అవుతోంది. ఇక ప్రభాస్ సైతం రామ్ చరణ్‌కు విషెస్ చెప్పలేదు. ప్రభాస్ తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండి చెప్పలేదేమో అని ఇంకొంత మంది అంటున్నారు. బన్నీ, ప్రభాస్ ఇలా అందరూ కూడా రామ్ చరణ్‌కు పర్సనల్‌గా మెసెజ్ పంపించి ఉంటారని, ప్రతీ సారి ఇలా సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని చెప్పుకోవాల్సిన పని లేదని ఇంకొంత మంది అంటున్నారు.

బన్నీ నిన్న అంతా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. కానీ ఇప్పుడు ఓ ట్వీట్ వేశాడు. నటుడిగా ఇరవై ఏళ్లు అయిందని, దీనికి కారణమైన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని, ఇదంతా కూడా అభిమానులు, సినీ ప్రేక్షకుల వల్లే సాధ్యమైందని అన్నాడు. ఇలా ఇప్పుడు ట్వీట్ వేసిన వాడు.. నిన్న ఓ ట్వీటేసి రామ్ చరణ్‌కు విషెస్ చెప్పొచ్చు కదా? అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మొన్న ఆస్కార్ వచ్చినప్పుడు కూడా మై బ్రదర్ అని చరణ్‌ను, తెలుగు ప్రైడ్ ఎన్టీఆర్ అని సంబోధించడంతో పెద్ద వివాదానికే దారి తీసిన సంగతి తెలిసిందే.

Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News