Ajay Devgan: స్పోర్ట్స్ డ్రామాలు భాషతో సంబంధం లేకుండా భారతదేశంలో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. లగాన్, దంగల్, గురు సినిమాలు ఇలా వచ్చి మంచి విజయాలు సాధించిన చిత్రాలే. అయితే ఈసారి స్పోర్ట్స్ డ్రామాలోనే సరికొత్త కథతో మన ముందుకి రాబోతున్నారు అజయ్ దేవగన్. బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయిన రియల్ హీరో సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్రను చూపించేందుకు ‘మైదాన్’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో సయ్యద్ పాత్రలో కనిపించనున్నారు అజయ్ దేవగన్.
ఫుట్‌బాల్ కోచ్‌గా భారతదేశం కోసం ఆయన చేసిన కృషి.. అందువల్ల ఆయన చరిత్రలో ఎలాంటి రికార్డులను సృష్టించాడు? అనే కథాంశంతో మైదాన్ రాబోతోంది. ప్రపంచంలో అత్యధికంగా ఆడే అట అయిన ఫుట్‌బాల్‌లో మన భారతదేశానికి ఎలా ప్రత్యేక గుర్తింపు వచ్చిందో.. అది కూడా ఎవరి వల్ల వచ్చింది అన్న విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతోన్నారు.
యథార్థ ఘటనల ఆధారంగా ఈ ‘మైదాన్’ సినిమాను 'బదాయి హో' ఫేమ్ అమిత్ రవీందర్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు ప్రియమణి నటిస్తూ ఉండగా..గజరాజ్ రావు, ప్రసిద్ధ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విరుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. సయ్యద్ అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణాన్ని తెరపై అంతే అద్భుతంగా చూపించారు ఈ సినిమా దర్శకుడు.
బోనీ కపూర్, అరుణవ జాయ్, జీ స్టూడియోస్, సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను సాయివిన్ క్వాడ్రాస్, రితేష్ షా అందించగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సాహిత్యాన్ని మనోజ్ ముంతాషిర్ శుక్లా అందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రంజాన్‌కు థియేటర్లలో విడుదల చేయనున్నారు ఈ సినిమా మేకర్స్.
Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!
Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter