సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న అందాల తార ఐష్

ఐశ్వర్యా రాయ్ బచ్చన్

Last Updated : Aug 3, 2018, 07:46 PM IST
సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న అందాల తార ఐష్

ఇంతకాలం నటిగా ఆడియెన్స్‌ని మెప్పించిన బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మెగా ఫోన్ పట్టుకునే ఆలోచనలో ఉంది. ఏదో ఒక రోజు ఓ సినిమాను డైరెక్ట్ చేస్తానని ఐష్ స్పష్టంచేసింది. ఐష్ నటించిన తాజా చిత్రం ఫనీ ఖాన్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఐష్... దర్శకురాలిగా మారాలన్న తన ఆలోచనను వెల్లడించింది. అయితే, అదేమీ ఇప్పటికిప్పుడు సాధ్యపడే కోరిక కాదని ఐష్ అభిప్రాయపడింది.

నిజ జీవితంలో భార్యగా, తల్లిగా, కోడలిగా ఇంట్లో ఎంతో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో వీలు కుదిరినప్పుడు సినిమాలు చేస్తోన్న ఐష్.. ఇప్పటికిప్పుడు ఓ సినిమాను డైరెక్ట్ చేసేంత సమయం తనకు దొరకడం కష్టమేనని తేల్చిచెప్పింది. అందుకే ఏదో ఓ రోజు సినిమాను డైరెక్ట్ చేయడం మాత్రం గ్యారెంటీ అంటున్న ఐష్‌కి ఆ విషయంలో తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తున్నట్టు తెలిపింది. 

Trending News