RRR Collections: దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. రెండో వారంలోనూ ఈ సినిమా కలెక్షన్లు ఎక్కడా తగ్గలేదు. ఆర్ఆర్ఆర్ రోరింగ్ సక్సెస్‌ను మేకర్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నైజాంలో విడుదల చేసిన దిల్ రాజు పంట పండినట్లయింది.
నైజాం ఏరియాలో ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దిల్ రాజు రూ.75 కోట్లకు కొనుగోలు చేశారు. ఒకరకంగా ఇది చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. బాహుబలి 2 సినిమా సైతం నైజాంలో రూ.75 కోట్ల షేర్ వసూలు చేయలేకపోయింది. అలాంటిది దిల్ రాజు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి రిస్క్ చేశారు. అయితే దిల్ రాజు రిస్క్‌కి తగిన ఫలితం దక్కింది.
తొలి వారంలో ఒక్క నైజాం ఏరియాలోనే 'ఆర్ఆర్ఆర్' రూ.77 కోట్లు కొల్లగొట్టింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగుతోంది. ఉగాది పండగ సినిమాకు బాగా కలిసొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమా నైజాంలో రూ.122 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేయవచ్చునని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రాధేశ్యామ్ డిజాస్టర్‌తో భారీగా నష్టపోయిన దిల్ రాజుకు ఇది భారీ ఊరట అని అంటున్నారు.