Aditi Rao Hydari Siddharth : రోడ్డు మీద పిచ్చి గెంతులు.. సిద్దార్థ్‌కు అదితీ స్వీట్ విషెస్.. వీడియో వైరల్

Aditi Rao Hydari Siddharth Love, Aditi Rao Hydari Siddharth Wedding, Aditi Rao Hydari Siddharth Dating, Aditi Rao Hydari Siddharth Rumors, Aditi Rao Hydari Siddharth, Siddharth Birthday, HBD Siddharth, Aditi Rao Hydari Wishes to Siddharth, Aditi Rao Hydari, Siddharth

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 05:02 PM IST
  • నెట్టింట్లో కొత్త జంట సందడి
  • హీరో సిద్దార్త్ బర్త్ డే వైరల్
  • అదితి రావ్ హైదరి స్పెషల్ వీడియో
Aditi Rao Hydari Siddharth : రోడ్డు మీద పిచ్చి గెంతులు.. సిద్దార్థ్‌కు అదితీ స్వీట్ విషెస్.. వీడియో వైరల్

Hero Siddharth Birthday సిద్దార్థ్ బర్త్ డే (ఏప్రిల్ 17) సందర్భంగా అదితి రావ్ హైదరీ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఈ ఇద్దరూ చిన్న పిల్లల్లా మారిపోయారు. రోడ్డు మీద గెంతులు వేసుకుంటూ పోయారు. అయితే సిద్దార్థ్ అదితిల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి రూమర్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వేసిన పోస్ట్‌తో వీరిద్దరి ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

అసలే సిద్దార్థ్ లవర్ బాయ్ అన్న సంగతి తెలిసిందే. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో సిద్దార్థ్‌ మ్యాజిక్ చేస్తుంటాడు. తనతో పని చేసే హీరోయిన్లను సిద్దార్థ్ ఇట్టే బుట్టలో వేసుకుంటాడనిపిస్తుంది. గతంలో సిద్దార్థ్ ప్రేమ కథల గురించి వచ్చిన వార్తలే వాటికి నిదర్శనంగా నిలుస్తాయి. సిద్దార్థ్ శ్రుతి హాసన్, సిద్దార్థ్ సమంతల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

సిద్దార్థ్‌కి ఆల్రెడీ పెళ్లి అయినా కూడా సమంత కోసం తన భార్యకు విడాకులు ఇచ్చాడని, సమంతతో పెళ్లి వరకు వ్యవహారం వెళ్లిందని, కానీ ఆ తరువాత మధ్యలోనే ఆ బంధం వీగిపోయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత సమంత నాగ చైతన్య పెళ్లి జరిగింది. సిద్దార్థ్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయాడు.

 

ఇప్పుడు సిద్దార్థ్ ఆదితి ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మహా సముద్రం సినిమాతో ఈ ఇద్దరి కాంబో సెట్ అయింది. ఆన్ స్క్రీన్ ప్రేమించుకోవాల్సింది పోయి.. ఆఫ్ స్క్రీన్ లోనూ ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది.  అయితే ఇంత వరకు ఈ విషయం మీద ఆదితి గానీ, సిద్దార్థ్ గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఇలా తిరిగేస్తున్నారు.

Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

తాజాగా సిద్దార్త్‌కు అదితీ స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పింది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. ఎంతో పవిత్రమైన హృదయం కలవాడు.. ఎప్పుడూ నవ్విస్తుంటాడు.. ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వవే ఉంది.. నీలానే ఎప్పుడూ ఉండూ.. అద్భుతాలు చేస్తూ ఉండు.. హ్యాపీయెస్ట్ సిద్దు డే అని విషెస్ చెప్పింది అదితి.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News