Adipurush First Review: ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ అంటూ పోస్ట్.. బూతులతో రెచ్చిపోయిన ఫ్యాన్స్

Adipurush Advance Ticket Bookings: పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. జూన్ 16న వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. ట్రైలర్‌తో అంచనాలు రెట్టింప అవ్వడంతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 13, 2023, 08:33 AM IST
Adipurush First Review: ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ అంటూ పోస్ట్.. బూతులతో రెచ్చిపోయిన ఫ్యాన్స్

Adipurush Advance Ticket Bookings: రెబల్ స్టార్ ప్రభాస్-బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. మైథలాజికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఐదు భాషల్లో ఆదిపురుష్‌ను రిలీజ్ చేయనున్నారు. రాఘవుడి పాత్రలో ప్రభాస్ యాక్ట్ చేయగా.. జానకి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. లంకేశ్వరుడిగా సైఫ్ ఆలీ ఖాన్ అలరించనున్నాడు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతుండగా.. రీసెంట్‌ రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తిరుపతిలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అభిమాన సంద్రం ఉప్పొంగింది. ఆదిపురుష్‌తో ప్రభాస్ ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ట్రైలర్‌తో అంచనాలు మరింత పెంచేయడంతో విడుదల తేదీకి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక తాజాగా ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ అంటూ ఉమైర్ సంధు అనే వ్యక్తి నెట్టింట పోస్ట్ చేశాడు. తనకు తాను ఓవరీసిస్ సెన్సార్ బోర్డు మెంబర్‌గా చెప్పుకునే ఈ ఉమైర్ సంధు.. హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతకర కామెంట్లు చేస్తుంటాడు. ఏదైనా సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంటే.. తన సొంత అభిప్రాయాన్ని ఫస్ట్ రివ్యూ అంటూ ప్రచారం చేస్తాడు. ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ చెప్పిన ఉమైర్ సంధు.. రూ.500 కోట్లు చెత్త బుట్టపాలయ్యాయని అన్నాడు. మూడు గంటలు టార్చర్ ఉందని.. ఫేక్ వీఎఫ్ఎక్స్ అని కామెంట్ చేశాడు. అందరూ నటుల పర్ఫామెన్స్ చాలా పూర్‌గా ఉందన్నాడు. మతపరమైన సినిమాను నాశనం చేసినందుకు మేకర్స్‌కు సిగ్గుపడాలని`ట్వీట్ చేశాడు. 

 

ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌ మండిపడుతున్నారు. బూతులతో కామెంట్స్ పెడుతున్నారు. 'నువ్వు అసలు సినిమా చూశావా.. జఫ్ఫా..' అంటూ తిడుతున్నారు. వీడు ఫేక్ రివ్యూ చెప్పాడంటే.. సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్..' అని అంటున్నారు. 'నీ అడ్రస్ పెట్టురా.. నీకు పగిలిపొద్ది..' అని వార్నింగ్ ఇస్తున్నారు. 'నీకు షో ఎవడు వేశాడు రా.. ముందు ఫేక్ రివ్యూలు మానుకో..' అని సూచిస్తున్నారు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.   

గతంలో కూడా ఉమైర్ సంధు అనేక సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల హీరోయిన్స్‌ గురించి దారుణంగా కామెంట్స్ చేస్తున్నాడు. వారి వ్యక్తిగత జీవితాల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. డబ్బు కోసం ఆ పని చేశారు.. ఈ పని చేశారు.. అంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నాడు. తాజాగా హీరో సూర్యకు దిశా పటాని అంటే క్రష్‌ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇతని నోటి దూలకు ఎప్పుడో ఒకసారి కచ్చితంగా చెక్ పడుతుంది.

Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే..?  

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News