Adipurush 5th day Collections: ఆదిపురుష్ కు ఎదురుదెబ్బ.. భారీగా పడిపోయిన కలెక్షన్స్.. ఐదో రోజు ఎంత వసూలు చేసిందంటే?

Adipurush Updates: తొలి మూడు రోజులు కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆదిపురుష్.. నాల్గో రోజు నుంచి బాక్సాపీస్ వద్ద బోల్తా పడింది. ఐదో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఐదో రోజు ఆదిపురుష్ ఎంత వసూలు చేసిందో తెలుసుకోండి.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2023, 04:17 PM IST
Adipurush 5th day Collections: ఆదిపురుష్ కు ఎదురుదెబ్బ.. భారీగా పడిపోయిన కలెక్షన్స్.. ఐదో రోజు ఎంత వసూలు చేసిందంటే?

Adipurush Box office Collections: ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన ఆదిపురుష్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఐదు రోజు భారీగా పడిపోయాయి. మెుదటి మూడు రోజుల్లో కాసుల వర్షం కురిపించిన ప్రభాస్ మూవీ.. నాలుగు రోజు నుంచి మాత్రం బోల్తాపడింది. వసూళ్ల 75 శాతం పైగా తగ్గాయి. హిందీలో అయితే కలెక్షన్లు మరి దారుణంగా పడిపోయాయి.

నాల్గో రోజు అన్ని భాషలు కలిపి కేవలం రూ.24.5  కోట్ల మాత్రమే వసూలు చేసిన ఆదిపురుష్.. ఐదో రోజు రూ.17.93 కోట్లకే పరిమతమైంది. తొలి రోజు రూ. 86.75 కోట్లు, రెండో రోజు రూ.65.25 కోట్లు, మూడో రోజు రూ.69.1 కోట్లు కలెక్షన్లు సాధించింది ఆదిపురుష్. ఇందులో సింహభాగం హిందీ, తెలుగు నుంచే ఉన్నాయి. మెుత్తం నాలుగు రోజుల కలెక్షన్లు కలుపుకుంటే ఇండియా వైడ్ గా రూ. 237.10 కోట్లు (నెట్), ప్రపంచవ్యాప్తంగా రూ.323.90 కోట్లు సాధించినట్లయింది. ఇక ఐదో రోజు కలెక్షన్లతో కలిపి సుమారు రూ.350 కోట్ల వసూల చేసినట్లయింది.

ఆదిపురుష్ చిత్రాన్ని సుమారు 500 కోట్ల వ్యయంతో టీ  సీరిస్ అధినేతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్ణణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్తా నటించారు. జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజైంది. మెుదటి రోజు నుంచి ఈచిత్రంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి తొలి మూడు రోజుల్లో ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

Also Read: Adipurush Movie: ఆదిపురుష్‌తో సైఫ్ అలీ ఖాన్ తెలుంగేట్రం, తరువాతి సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

 

Trending News