Sonali Bindre Rumours: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఆ అవసరం నాకు లేదు: సోనాలి బింద్రె

Sonali Bendre denies rumours about her financial status. తాను ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నానని, అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానంటూ తనపై వచ్చిన పుకార్లను సోనాలి బింద్రె కొట్టిపారేశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 30, 2022, 06:23 PM IST
  • ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు
  • ఆ అవసరం నాకు లేదు
  • ది బ్రోకెన్‌ న్యూస్‌ వెబ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ
Sonali Bindre Rumours: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఆ అవసరం నాకు లేదు: సోనాలి బింద్రె

Sonali Bendre denies rumours about her financial status: సోనాలి బింద్రె.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఉన్నారు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షలను ఫిదా చేశారు. సోనాలి బింద్రే తెలుగులో 'మురారి', 'ఖడ్గం', 'ఇంద్ర', 'మన్మథుడు', 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. హిందీలో కూడా పలు హిట్ సినిమాలు చేశారు. 2013లో హిందీలో వచ్చిన 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై దొబార' చిత్రంలో అతిథిగా కనిపించారు. సోనాలి బింద్రే 2018లో క్యాన్సర్‌ బారిన పడి న్యూయార్క్‌లో చికిత్స అనంతరం కోలుకున్నారు. 

‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో సోనాలి బింద్రె రీ ఎంట్రీ ఇచ్చారు. జూన్ 10న ఈ వెబ్ సిరీస్ Zee5లో విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి పలు విషయాలపై స్పందించారు. తాను ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నానని, అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానంటూ తనపై వచ్చిన పుకార్లను కొట్టిపారేశారు. తాను ఆర్థికంగా బాగున్నానని, ఆఫర్స్‌ కావాలని అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటీవల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్‌ కావాలంటూ దర్శక-నిర్మాతలకు సోనాలి విజ్ఞప్తి చేసుకుంటుందంటూ బి-టౌన్‌లో జోరుగా గుసగుసలు వినిపించాయి.

సోనాలి బింద్రె మాట్లాడుతూ... 'నాకు డబ్బు సమస్య ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఆర్థికంగా బాగున్నా. అలానే ఆఫర్స్‌ కావాలని అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30లో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం నేను ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. మంచి కథ, పాత్ర నచ్చితే తప్పకుండా చేస్తాను. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా' అని చెప్పారు. 

Also Read: Major OTT: ఓటీటీలోకి మేజర్‌.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Also Read: రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా! ఓపెనర్‌‌గా తెలుగు ప్లేయర్.. భారత తుది జట్టు ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News