Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నటుడు సోనూ సూద్, సాయం చేయాలంటూ విజ్ఞప్తి

Actor Sonu Sood Latest Updates : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ అందజేసిన ఘనత భారత్ సొంతం. కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని రోజులుగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 15, 2021, 04:54 PM IST
Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నటుడు సోనూ సూద్, సాయం చేయాలంటూ విజ్ఞప్తి

CoronaVirus Second Wave | గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారిని మెరుగ్గా ఎదుర్కొన్న దేశాలలో భారత్ ఒకటి. కొన్ని రోజుల కిందటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ అందజేసిన ఘనత భారత్ సొంతం. కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని రోజులుగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతుండటంతో 10 ఆక్సిజన్ సిలిండర్లను తన వంతుగా సోనూ సూద్ సాయం చేశారు. అందరికీ అంతా మంచే జరగాలని నటుడు ఆకాంక్షించారు. మీరు కూడా సొంతంగా ముందుకొచ్చి ఇతరులకు తమ వంతు సాయం అందజేసి సాధ్యమైనన్ని ప్రాణాలు కాపాడాలని Sonu Sood పిలుపునిచ్చాడు. సాయానికి మారుపెరుగా మారిపోయాడు సోనూ సూద్.

Also Read: Theatre Rates New GO: ధియేటర్ రేట్లపై ఏపీ ప్రభుత్వ జీవోతో నష్టాలంటున్న ధియేటర్ యజమానులు

గత ఏడాది లక్షలాది వలస కార్మికులు, దినసరి కూలాలీను వారి ఇళ్లకు చేర్చేందుకుగానూ ఈ నటుడు కోట్లాది రూపాయాలు ఖర్చు చేశాడు. దేశ వ్యాప్తంగా హీరోగా మారిపోయాడు. తాను కేవలం సినిమాల్లోనే విలన్ అని నిజజీవితంలో ఓ మంచి వ్యక్తినని సోనూ సూద్ నిరూపించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చే రిక్వెస్ట్‌లు చెక్ చేసి తనకు తోచిన సాయాన్ని అందించాడు. కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య(Acharya Movie) షూటింగ్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు.

ఏపీలో ఓ కుటుంబం కష్టాన్ని చూసి స్పందించాడు. తాను ముంబైలో ఉన్నప్నటికీ తనను ఎంతగానో ఆదరించిన తెలుగు వారికి ఆపన్నహస్తం అందించారు. ఏపీలోని ఓ రైతు కుటుంబానికి వ్యవసాయ పనులు చేసుకునేందుకు ట్రాక్టర్ అందించాడు. రైలు, విమానం, బస్సు, ఇలా తోచిన మార్గాల ద్వారా లక్షలాది మందిని లాక్‌డౌన్ సమయంలో వారి సొంత గూటికి చేర్చి వారి గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడు. తాజాగా తన వంతు సాయంగా 10 ఆక్సిజన్ సిలిండర్లు కరోనా పేషెంట్ల కోసం విరాళం అందించాడు.

Also Read; Malaika Arora Engagement: మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎంగేజ్‌మెంట్ జరిగిందా, హాట్ టాపిక్‌గా మారిన డైమండ్ రింగ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x