Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం

క‌రోనావైరస్‌ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్‌డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.

Last Updated : Nov 22, 2020, 06:29 AM IST
Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం

Sonu Sood felicitated by Tanikella Bharani in Acharya movie sets: క‌రోనావైరస్‌ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్‌డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటికీ కూడా తనను సంప్రదించిన వారందరికీ సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరోగా, ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నారు సోనూసూద్. అందుకే ఆయన్ను మనసున్న మహారాజు అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు కొనియాడుతున్నారు. 

లాక్‌డౌన్‌లో.. ఆతర్వాత సోనూసూద్ చేస్తున్న సేవలను కొనియాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న ఆచార్య సినిమా సెట్‌లో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ప్ర‌ముఖ న‌టుడు, ర‌చయిత త‌నికెళ్ల‌ భ‌ర‌ణి (Tanikella Bharani)  సోనూసూద్‌కు స‌త్కారం చేసి హనుమాన్ విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ చేసిన సేవలను గుర్తుచేస్తూ.. తనికెళ్ల మెచ్చుకున్నారు. దీంతోపాటు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు కూడా తనికెళ్ల భరణి స‌న్మానం చేశారు. ఇటీవ‌లే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టిస్తోన్న ‘అల్లుడు అదుర్స్’ సెట్స్‌లో చిత్ర‌యూనిట్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోనూసూద్‌ను ఘనంగా స‌న్మానించిన విష‌యం తెలిసిందే. Also read: Megastar Chiranjeevi: వెదళాం రీమేక్ కోసం మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ కూడా సెట్స్‌పైకి వెళ్లింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మెగాస్టార్ సరసన హిరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.

Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News