Sai Dharam Tej: ఆ వదంతులకు చెక్ పెట్టిన సాయిధరమ్ తేజ్

నటుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటరు’. మిగతా యూనిట్ సభ్యులు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారని, నటుడు సాయిధరమ్ తేజ్‌ (Sai Dharam Tej)కు సైతం కరోనా సోకిందని ప్రచారం జరిగింది.

Last Updated : Oct 7, 2020, 04:55 PM IST
Sai Dharam Tej: ఆ వదంతులకు చెక్ పెట్టిన సాయిధరమ్ తేజ్

మెగా మేనల్లుడు, టాలీవుడ్ (Tollywood) నటుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటరు’. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇటీవల పూర్తయినట్లు సమాచారం. అయితే ఇటీవల మూవీ యూనిట్‌లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగతా యూనిట్ సభ్యులు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారని, నటుడు సాయిధరమ్ తేజ్‌ (Sai Dharam Tej)కు సైతం కరోనా సోకిందని ప్రచారం జరిగింది.

సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ కేవలం వదంతులేనని తెలిపేలా తేజ్ ఓ ఫొటోను ట్వీట్ చేశాడు. తన 14వ సినిమా దేవాకట్టాగారితో చేస్తున్నానని, ఆయన సినిమాలో సినిమా స్క్రిప్ట్ పనులు చూస్తున్నట్లుగా ఓ ఫొటోను వదిలాడు సాయిధరమ్ తేజ్. తన తర్వాతి సినిమా పనుల్లో నటుడు బిజీగా ఉంటే, కరోనా అంటూ లేనిపోనివి ప్రచారం చేస్తున్నారని తేలిపోయింది.

 

ఇది చూసిన నెటిజన్లు సైతం సాయిధరమ్ తేజ్ సేఫ్‌గానే ఉన్నాడని, వదంతులకు ఒక్క ఫొటోతో మెగా మేనల్లుడు బదులిచ్చాడంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. జేబీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆ సినిమా రాబోతోంది. మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. అక్టోబర్ మూడో వారంలో షూటింగ్ పట్టాలెక్కేలా కనిపిస్తోంది.

Also Read : Guess Who: ఈ ఫొటోలోని సినీ సెలబ్రిటీని గుర్తుపట్టారా..? 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News