Samantha Face: సమంతది ముసలి ముఖం.. ఆమె శకుంతల ఏంటి.. నటుడు షాకింగ్ కామెంట్స్!

Samantha Face Faded Out: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి, ఆమె ముఖం గురించి త్రిపురనేని చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

Last Updated : Apr 16, 2023, 12:22 AM IST
Samantha Face: సమంతది ముసలి ముఖం.. ఆమె శకుంతల ఏంటి.. నటుడు షాకింగ్ కామెంట్స్!

Chittibabu Sensational Comments on Samantha Face: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి తెలుగులో నటుడిగా, నిర్మాతగా వ్యవహరించిన త్రిపురనేని చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల సమంత శాకుంతలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గుణ శేఖర్ డైరెక్షన్లో ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాను దిల్ రాజు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తో రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం విడుదలైంది. అయితే సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో ఆశించడమేర వసూళ్లు అయితే దక్కడం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చిట్టిబాబు, సమంత మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమంత అనారోగ్యం వల్ల ముఖం పీక్కుపోయిందని అందుకనే ఏదేదో చేస్తుందని, తాను చనిపోయే లోపు ఇలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నాను అంటూ రకరకాల సినిమాలు సెట్ చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఆ అమ్మాయి, ప్రతి సినిమా ముందు ఇలాంటి సెంటిమెంటల్ డ్రామాలు క్రియేట్ చేస్తూ వస్తోందని యశోద సినిమా సమయంలో కూడా డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఉన్న ఫోటో రిలీజ్ చేసిందని నిజానికి ఒకప్పుడు హై ఫీవర్ తో ఉండి నటించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: Venkatesh Affairs: వెంకటేష్ పవిత్రుడేమీ కాడు.. వారితో ఎఫైర్లు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!

హీరోయిన్ గా ఆమె కెరీర్ అయిపోయిందని ఈ సందర్భంగా చిట్టిబాబు పేర్కొన్నారు. కెరీర్ అయిపోయింది కాబట్టే ఇప్పుడు తాను చేసిన సినిమాలను ఏదో ఒక సెంటిమెంట్ ప్లే చేసి హిట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అమ్మాయి డ్రామా సెంటిమెంట్ క్రియేట్ చేస్తోందని దీనివల్ల సానుభూతి పొంది సినిమాలు హిట్ చేసుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దృశ్య కావ్యం అవుతుందో అ దృశ్య కావ్యం అవుతుందో చూడాలంటూ చమత్కరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News