Sambala Movie First Look Poster: డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి.. ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందజేస్తున్నారు. తాజాగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్లేలా శంబాల మూవీని తెరకెక్కిస్తున్నారు. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తుండగా.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. మూవీలో అద్భుత ఘట్టాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. నేడు (డిసెంబర్ 23) ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పవర్ రోల్లో ఆది సాయికుమార్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
ఓ వైపు మంట పెద్ద ఎత్తున వస్తుండగా.. వాటిలో నుంచి హీరో సైకిల్ మీద రావడం సరికొత్తగా ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో ఆకాశం ఎరుపెక్కి కనిపిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు అర్థమవుతోంది. పోస్టర్‌తోనే మూవీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్‌గా నటిస్తున్నారు. అర్చన అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్వాసిక కీలక పాత్ర పోషిస్తున్నారు. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల రెగ్యులర్ షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్, కథతో హర్రర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో యుగంధర్ ముని ట్రైనింగ్ తీసుకున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో గ్రాండ్ విజువల్స్‌లో భారీ ఎత్తున శంబాల మూవీని తెరకెక్కిస్తున్నారు. విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తుననారు. శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ స్వరకర్తలతో కలిసి ఆయన పని చేశారు. నేపథ్య సంగీతంలోనూ సరికొత్త మార్క్ క్రియేట్ చేయనున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో రానున్నారు.
Also Read: Allu Arjun: పుష్పరాజ్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.