Aa Ammayi Gurinchi Meeku Cheppali vs Nenu Meeku Baaga Kavalsinavaadini vs Saakini Daakini : ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అనేక సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కిరణ్ అబ్బవరం హీరోగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని, రెజీనా- నివేదా థామస్ హీరోయిన్లుగా శాకినీ డాకినీ సినిమాలతో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా నటించిన కోటిగొబ్బ అనే సినిమాను కే 3 కోటికొక్కడు పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఇవి కాకుండా సకల గుణాభి రామ అంటూ బిగ్ బాస్ విన్నర్ వీజీ సన్నీ హీరోగా ఒక సినిమా కూడా విడుదలైంది. అయితే ఒకే రోజు ఇన్ని సినిమాలు విడుదల కావడంతో ప్రేక్షకులు అందరూ కూడా ఏ సినిమా చూడాలనే విషయం మీద కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే విడుదలైన ఈ సినిమాలు చూసిన తర్వాత ఏ సినిమా బాగుంది అనే విషయం మీద సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా బాగుంది అని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం అది అవుట్ డేటెడ్ స్టోరీ అని చాలా రొటీన్ స్టోరీ అని కామెంట్ చేస్తున్నారు.
కొంతమంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తుంటే మరి కొంతమంది సినిమా బాగానే ఉంది కానీ కాస్త రొటీన్ స్టోరీ అనిపించిందని కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం సినిమా స్టోరీ రొటీన్ కాదని ఈ పాయింట్ కొత్తగా అనిపించిందని కామెంట్ చేస్తున్నారు. ఇక శాకినీ డాకినీ సినిమా విషయానికి వస్తే కథలో కొత్తదనం ఏమీ లేదని తెలుగులో మనం ఎన్నో క్రైమ్ థ్రిల్లర్లు చూసాం అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ అని కామెంట్ చేస్తున్నారు.
బుక్ మై షోలో కూడా నేను మీకు బాగా కావాల్సిన వాడిని, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు రెండింటికీ మంచి స్పందన లభిస్తోంది. అయితే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మాత్రం కిరణ్ అబ్బవరం సినిమా అనే చెప్పాలి. మొత్తం మీద ఈ వారం మిగతా సినిమాలతో పోలిస్తే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సన్నీ సినిమా గురించి కానీ సుదీప్ సినిమా గురించి కానీ సోషల్ మీడియాలో కూడా పెద్దగా బజ్ అయితే లేదు.
Also Read: Saakini Daakini Review: 'రెజీనా-నివేధా'ల శాకిని డాకిని మూవీ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి