Wife Along With Her Lover Killed Her Husband In Haryanas Hisar: హర్యానాలోని హిసార్ జిల్లాలోని ధిక్తానా గ్రామంలో దృశ్యం సినిమాలో చూపించిన లాంటి సంఘటన తెరపైకి వచ్చింది. అక్కడ కులదీప్ అనే వ్యక్తి హత్యకేసులో సునీల్, సుశీల్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో నిందితులిద్దరూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని తేలింది. కులదీప్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని అతని ఇంటిలో పాతిపెట్టినట్లు ముందుగా నిందితుడు పోలీసులకు చెప్పాడు. దీంతో బుధవారం బర్వాలా పోలీసులు గ్రామస్తుల సహకారంతో ఇంటిలో తవ్వినా ఏమీ దొరకలేదు.
మరోసారి నిందితులను కఠినంగా విచారించగా, మృతదేహాన్ని బావిలో పడేసినట్లు పేర్కొన్నారు. ఆ తరువాత, అక్కడ కూడా మృతదేహం దొరకకపోవడంతో పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా నిందితులు 19 జూలై 2021 న కుల్దీప్‌ను హత్య చేసిన తర్వాత, అతని మృతదేహాన్ని బాల్సమండ్ కాలువలో విసిరామని ఒప్పుకున్నారు. బర్వాలా పోలీస్ స్టేషన్ నుంచి నిందితులిద్దరినీ బుధవారం ఉదయం ధిక్తానా గ్రామం కుల్దీప్ ఇంటికి తీసుకెళ్లింది.
అక్కడ పోలీసులు గ్రామస్థుల సహకారంతో తవ్వకాలు ప్రారంభించినా అక్కడ ఏమీ దొరకలేదు. ఆ తర్వాత గుంతలో మట్టిని నింపారు. అక్కడ ఏమీ దొరకకపోవడంతో పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించడంతో అప్పుడు మృతదేహాన్ని బావిలో పడేశామని చెప్పారు. బావిలో వెతికినా అక్కడ కూడా ఏమీ కనిపించలేదు. నిందితుడిని అర్థరాత్రి వరకు పోలీసులు విచారించడంతో కాల్వలో పడేసినట్లు చెప్పారు నిందితులు. అక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు.
జూలై 2021లో ఎఫ్‌ఐఆర్
ధిక్తానా గ్రామానికి చెందిన కుల్దీప్ 19 జూలై 2021న అదృశ్యమయ్యాడు. ఇంటికి రాకపోవడంతో అతని భార్య బర్వాలా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. తన భర్త ఆటో నడిపేవాడని, తాను కూలీగా పనిచేస్తున్నానని మహిళ చెప్పింది. పోలీసులు మహిళ ఇంటికి చేరుకునే సరికి ఆమె బాధలో ఉన్నట్టే కనిపించింది. ఈ క్రమంలో పోలీసులు ఒక గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించి ఫోన్ చేయడంతో పోలీసు స్టేషన్‌కు చేరుకున్న బంధువులు మృతదేహాన్ని కుల్దీప్‌గా గుర్తించారు.
అనైతిక సంబంధమే
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిక్తానా నివాసి కుల్‌దీప్ భార్యకు గ్రామానికి చెందిన సునీల్‌తో అనైతిక సంబంధం ఏర్పడింది. ఈ విషయం గురించి కులదీప్‌కి తెలియడంతో అతన్ని జూలై 2021 సమయంలో అడ్డు తొలగించుకోవడం కోసం తన ప్రేమికుడు సునీల్‌తో కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో సునీల్ తన స్నేహితుడు ఖరార్‌లో నివాసముంటున్న సుశీల్‌ను తన వెంట తీసుకెళ్లాడు. జూలై 18 రాత్రి, కుల్దీప్‌ను కుట్రతో హత్య చేసి, ఆపై మృతదేహాన్ని బాల్సమండ్ కాలువలో విసిరగా 21 జూలై 2021న, పోలీసులు సర్సానా నుండి కుల్దీప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అనేక రోజుల పాటు దర్యాప్తు చేసిన తరువాత ఒక హత్య, ఆ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన ఆరోపణలపై సునీల్, సుశీల్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విధంగా బయటకు
పోలీసులకు అందిన సమాచారం మేరకు నిందితుడు సునీల్‌కు, మృతుడి భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఉండేది. మృతుడి భార్య సునీల్‌ను తనని పెళ్లి చేసుకోమని కోరుతూ ఉండేది. అయితే ఇప్పటిదాకా నిన్నే చేసుకుంటానని చెబుతూ వచ్చిన సునీల్ మరో పెళ్లి చేసుకోబోతుండడంతో ఆమె వ్యతిరేకించింది. ఎన్ని చెప్పినా ఆమెతో సునీల్ పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో తనకు దక్కనివాడు ఏమైనా పర్లేదని భావించిన ఆమె రెండు రోజుల క్రితం తన భర్తను హత్య చేసిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు బర్వాలా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ కుల్‌దీప్ మృతదేహంగా భావించి అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదనే అంశం మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Nagole Gold Theft Case: నాగోలులో కాల్పులు, బంగారం చోరీ ఘటనలో ఇద్దరికి గాయాలు
Also Read: Lucky Girls Zodiac Signs: ఆ మూడు రాశుల అమ్మాయిలకు జీవితంలో డబ్బు కొరతే ఉండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook