Fire Accident: అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రాణభయంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాత్రూమ్‌లోకి వెళ్లారు. మంటలు అక్కడికి కూడా వ్యాపించడంతో వారిద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. తీవ్ర గాయాలకు గురైన వారిద్దరినీ ఆస్పత్రికి తరలించలోపే మృతి చెందారు. ఈ విషాద సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.
Also Read: Fire Accident: దంచికొడుతున్న ఎండలు.. కాలిబూడిదైన రూ.10 కోట్ల ఆహార పదార్థాలు
ఢిల్లీలోని సదర్‌బజార్ చమేలియన్ రోడ్డులోని ఓ ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. అనూహ్యంగా మంటలు వ్యాపించడంతో భవనంలో నివసిస్తున్న వారంతా బయటకు వచ్చారు. అయితే ఆ భవనంలో కుటుంబంతో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు గుల్షానా (14), అనాయ (12) ప్రమాదం సమయంలో చిక్కుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక ఒక బాత్రూమ్‌లోకి వెళ్లారు. అయితే మంటలు బాత్రూమ్‌ను చుట్టుముట్టడంతో అక్కాచెల్లెళ్లు బయటకు రాలేని పరిస్థితి. వారిద్దరూ బాత్రూమ్‌లోనే ఉండిపోయారు. అగ్నిప్రమాదానికి తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
Also Read: Comedian Visweswara Rao: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి
మంటలతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. విష వాయువు పీల్చుకోవడంతో వారు అస్వస్థతకు గురయి బాత్రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. పిల్లలు ఇద్దరు బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. అతికష్టంగా గుల్షానా, అనయను బయటకు తీసుకొచ్చారు. వారిద్దరికీ వెంటనే ప్రథమ చికిత్స చేయగా వాళ్లు స్పృహలోకి రాలేదు. సీపీఆర్ చేయగా కూడా అక్కాచెల్లెళ్లు మేల్కొకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వారిద్దరూ అప్పటికే మృతిచెందారని ధ్రువీకరించారు. వారిద్దరూ మృతితో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వారిద్దరి మరణంతో తీవ్ర విషాదం మిగిలింది. అయితే ప్రమాదం సంభవించడానికి కారణాలు తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా వేసవితో ఉష్ణోగ్రతలు పెరిగి ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
'మధ్యాహ్నం 2.10 నిమిషాల సమయంలో ప్రమాదం విషయం తెలిసింది. వెంటనే నాలుగు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. మంటలు, పొగ తీవ్రంగా వ్యాపించాయి. వీటి ప్రభావంతో బాత్‌రూమ్‌లో ఇద్దరు బాలికలు చిక్కుకున్నారు. తలుపులు పగలగొట్టి వారిని బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు' ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ మనోజ్ కుమార్ మీనా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook