Most Wanted Criminal: కష్టపడి పట్టుకున్న ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు వదిలేశారు. ఇదేంటి మీకు వింతగా అనిపిస్తోందా? నాగిరెడ్డి అనే ఓ అంతరాష్ట్ర దొంగలకే దొంగ. ఈ గజదొంగ ఇటీవలే మహారాష్ట్ర పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ దొంగను పట్టుకునేందుకు దాదాపు పోలీసులు నిద్ర ఆహారాలు మానుకొని రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డారు. చివరికి ఈ గజదొంగ ఎంతో చాకచక్యంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతలోనే మీరు ఊహించని కలలో అనుకోని సంఘటన జరిగింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ పోలీసులేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఊహించని సంఘటన ఏంటో? పోలీసులు ఈ గజదొంగని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగిరెడ్డిని పట్టుకున్న తరువాత ధ్వరాడ జైల్లో ఉంచారు. ఇంతలోనే కడప జిల్లాకు చెందిన పోలీసులు ఎంట్రీ అయ్యారు. అయితే కడప జిల్లా పోలీసులు వారి పోలీస్ స్టేషన్లో కూడా నాగిరెడ్డి పై ఎన్నో కేసులు నమోదయ్యాయని PT వారంటీ పైన నాగిరెడ్డిని కడపకి తీసుకువచ్చారు. ఈ గజదొంగను కోర్టులో హాజరు పరిచిన తర్వాత మళ్లీ మహారాష్ట్ర అప్పగించాల్సి ఉంటుంది.
Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
కానీ ఇక్కడ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. మహారాష్ట్ర పోలీసులకు ఆంధ్ర పోలీసుల నుంచి ఓ బ్యాడ్ న్యూస్ అందింది. నాగిరెడ్డి కోర్టులో హాజరు వచ్చే క్రమంలో తప్పించుకో పోయాడని.. అతన్ని వెతికే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుని విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండడాన్ని మహారాష్ట్ర పోలీసులు తప్పు పట్టారు. అంతేకాకుండా నాగిరెడ్డిని కావాలని ఏపీ పోలీసులు తప్పించారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
నాగిరెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయి:
గజదొంగ నాగిరెడ్డి పై ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో నాన్ బెలబుల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. నాగిరెడ్డి ఇండియాలో ఉండడం వల్ల బెయిల్ పొందే అవకాశాలు లేవని.. ఇతర దేశాలకు పారిపోయే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ గజదొంగపై ముందు జాగ్రత్తగా పోలీసులు ఇతర దేశాలకు పారిపోకుండా రెడ్ కార్నర్ నోటీసులను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నాగిరెడ్డి త్వరలోనే విమానాశ్రయాల్లో లేదా దేశంలోని బార్డర్ లోని దొరికే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.
Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook