Obscene Profiles: అమ్మను తిట్టారని మైనర్ ఘాతుకం.. అక్కా చెల్లెళ్ల ఫొటోలతో రెచ్చిపోయి!

Obscene Profiles Of Neighbor Girls:  తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించారని ఇద్దరు అక్కా చెల్లెళ్ళ మీద కోపం పెంచుకున్న ఒకవ్యక్తి వాళ్ల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫోటోలు డౌన్ లోడ్ చేసి వాళ్లకి నరకం చూపించాడు..

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 28, 2022, 09:54 PM IST
Obscene Profiles: అమ్మను తిట్టారని మైనర్ ఘాతుకం.. అక్కా చెల్లెళ్ల ఫొటోలతో రెచ్చిపోయి!

Minor Creates Obscene Profiles Of Neighbor Girls: సాధారణంగా ఇరుగుపొరుగు గొడవ పడడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వారు గొడవ పడుతూ ఉండటం ఒక్కోసారి కొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది.  పూర్తిగా మాటలు మాట్లాడటం మానేయడం చేస్తూ ఉంటారు. కానీ ఒక మైనర్ యువకుడు తన తల్లితో గొడవపడిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఏడిపించాలని అనుకున్నాడు. అందుకే తన ఇంటి పక్కన ఉండే ఇద్దరు అమ్మాయిల సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను చూసి వాళ్లని వాటితోనే ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు.

వెంటనే ఆ అమ్మాయిలు ఇద్దరి ఫోటోలు డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేశాడు. అసభ్యకరంగా తయారు చేసి ఆ ఇద్దరు పేర్ల మీద నకిలీ ఖాతాలు తెరిచి ఆ ఖాతాల ద్వారానే ఇద్దరు అమ్మాయిలకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పక్కింటి మైనర్ బాలిక అనే సోదరి ఈ విషయం మీద మదన పడుతూ ఉండేవారు, ఎంతకూ ఈ బాధ తగ్గకపోవడంతో వారిద్దరూ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి ఐపీ అడ్రస్ ద్వారా ఎవరు ఈ పనిచేశారు అనే విషయాన్ని గుర్తించారు. 17 ఏళ్ల యువకుడే ఈ పని చేశాడని గుర్తించి అతన్ని వెంటనే అరెస్టు చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా సదరు నిందితుడు తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. 2020లో సదరు బాలికల తండ్రి తన తల్లితో గొడవపడ్డాడని చెప్పుకొచ్చారు.

ఆ క్రమంలో బాలికలు ఇద్దరూ తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించారని వారి మీద పగ తీర్చుకునేందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో బాధితుల ఫోటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసి వాటిని అసభ్యకరంగా మార్చానని ఒప్పుకున్నాడు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా సదరు నిందితుడు తన చేసిన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతను వాడే మొబైల్ ఫోన్ సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. పలు సైబర్ సెక్షన్ల కింద అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.

Also Read: Supreme Court: న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. అలాంటి ప్రకటన చేయకూడదు

Also Read: Vande Bharat Trains: వందేభారత్‌లో ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఆ సమస్యకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News