Road Accident In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిష్త్వార్‌లో క్రూజర్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. దందురు పవర్ ప్రాజెక్ట్ కార్మికులు విధులకు వెళుతుండగా.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ..వాహనం రోడ్డుపై నుంచి జారి లోతైన లోయలో పడిపోయిందన్నారు. బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో డంగుదురు పవర్ ప్రాజెక్ట్ సైట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. డంగుదురు డ్యామ్ సైట్ వద్ద జరిగిన దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుందన్నారు. కిష్త్వార్ డాక్టర్ దేవాన్ష్ యాదవ్‌తో ఇప్పుడే మాట్లాడానని చెప్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
J&K | A cruiser vehicle of Pakal Dul Project with 10 people on board, met with an accident in Kishtwar, some feared dead. Further details awaited: DC Kishtwar pic.twitter.com/AAQICSgdhS
— ANI (@ANI) May 24, 2023
రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో టూరిస్ట్ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 25 మందికి గాయాలు అయ్యాయి. బస్సులోని ప్రయాణికులందరూ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మహిళలు, పిల్లలు సహా దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
Also Read: Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హఠాన్మరణం.. కారణం ఇదే..!
Also Read: Virat Kohli: థ్యాంక్యూ బెంగుళూరు.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook